Begin typing your search above and press return to search.

మూడేళ్ల పిల్లాడిపై కబ్జా కేసు పెట్టేసిన పోలీసులు

By:  Tupaki Desk   |   20 Dec 2015 4:10 AM GMT
మూడేళ్ల పిల్లాడిపై కబ్జా కేసు పెట్టేసిన పోలీసులు
X
పోలీసులు తలుచుకుంటే ఏమైనా చేయగలరన్న విషయం తాజాగా మరోసారి నిరూపితమైంది. కాకుంటే.. ఈ వ్యవహారం భారత్ లో కాకుండా పాకిస్థాన్ లోచోటు చేసుకుంది. ఆ దేశంలో సంచలనం సృష్టిస్తున్న ఈ ఉదంతంలో.. మూడేళ్ల ముక్కుపచ్చలారని కుర్రాడిపై పోలీసులు కబ్జా కేసు పెట్టటమే కాదు.. అదుపులోకి తీసుకుంటారన్న భయంతో ఆ చిన్నారి తండ్రి పరుగుపరుగున కోర్టు దృష్టికి ఈ ఉదంతాన్ని తీసుకెళ్లారు.

దీంతో.. ఈ కేసును విచారించిన కోర్టు.. పోలీసుల ఘనకార్యానికి విస్మయానికి గురైంది. ఒక భూమిని ఆక్రమించుకొని కబ్జాకు పాల్పడ్డారని.. ఆస్తుల దొంగతనానికి పాల్పడినట్లుగా పోలీసలు ఒక కేసు కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో సదరు కుర్రాడి తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. తన కొడుక్కి మూడేళ్లు మాత్రమేనన్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లటంతో పోలీసులపై న్యాయస్థానం ఫైర్ అయ్యింది.

మూడేళ్ల పిల్లాడు కబ్జా ఎలా చేస్తాడంటూ పోలీసులకు తలంటు పోసిన జడ్జి.. ఈ కేసు విషయం సంగతి తర్వాత.. ఈ కేసును నమోదు చేసిన పోలీసుల్ని గుర్తించి వారికి సమన్లు ఇవ్వాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.