Begin typing your search above and press return to search.

పిల్లాడికి తల్లి పాలు ఇస్తున్న వేళ..ఇంట్లోకి చిరుత వచ్చింది

By:  Tupaki Desk   |   30 Sept 2019 10:37 AM IST
పిల్లాడికి తల్లి పాలు ఇస్తున్న వేళ..ఇంట్లోకి చిరుత వచ్చింది
X
హృదయవిదారక ఘటనగా దీన్ని చెప్పాలి. ఆ తల్లి గుండెకోత కన్నీళ్లు తెప్పిస్తోంది. ఎలాంటి సందర్భంలోనూ ఇలాంటి పరిణామాన్ని ఊహించనలేని వారంతా.. జరిగిన ఘటనపై విస్మయానికి గురి అవుతున్నారు. ఉత్తరాంచల్ లోని పిథౌర్ గఢ్ జిల్లాలోని బెరీనాగా తహసీల్ కు చెందిన ఒక మహిళ (హేమాదేవి) తన మూడేళ్ల కొడుకు (నైతిక్ కార్కీ) చేత ఇంట్లో పాలు తాగిస్తోంది. ఎలా వచ్చిందో కానీ.. ఇంట్లోకి ప్రవేశించిందో చిరుత.

అదాటున ఆ మూడేళ్ల బాలుడ్ని నోటికి కరుచుకొని బయటకు వెళ్లిపోయింది. జరిగిన హఠాత్ పరిణామానికి షాక్ కు గురైన మహిళ పెద్ద ఎత్తున అరవటంతో.. చుట్టుపక్కల వారంతా చిరుతను వెంబడించారు. నోట కరుచుకొని వెళ్లిన పిల్లాడ్ని.. కొద్ది దూరం తీసుకెళ్లి.. రోడ్డు మీద వదిలేసి వెళ్లిపోయింది చిరుత.

పిల్లాడి మెడ మీద.. ఇతర శరీర అవయువాల మీద గాయాల నేపథ్యంలో అతడ్ని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆ పిల్లాడు మరణించినట్లుగా వైద్యులు వెల్లడించారు. పిల్లాడి తండ్రి ఢిల్లీలోని ఒక ప్రైవేటు కంపెనీలు పని చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ దారుణ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.