Begin typing your search above and press return to search.
మూడేళ్ళ ముఖ్యమంత్రి : ఒక వైపే చూపు...అందుకే?
By: Tupaki Desk | 30 May 2022 3:30 AM GMTముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడేళ్ళ పాలనను పూర్తి చేసుకున్నారు 2019 ఎన్నికలలో అద్భుతమైన మెజారిటీతో ఘన విజయం సాధించిన జగన్ 151 సీట్లను గెలుచుకున్నారు. మే 30న విజయవాడలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో అంగరంగ వైభవంగా జరిగిన ఒక కార్యక్రమంలో జగన్ అను నేను అంటూ అభిమాన జన సందోహం మధ్య ప్రమాణం చేశారు. ఇక మూడేళ్ళ ముఖ్యమంత్రిత్వం పూర్తి చేసుకుని ఆయన కొత్త ఏడాదిలో అడుగుపెడతారు.
మూడేళ్ళు అంటే చాలా కీలకం. పైగా అయిదేళ్ళ పాటు ప్రజలు అధికారం అప్పగిస్తే అందులో సింహభాగం పూర్తి అయినట్లే. దాంతో ప్రభుత్వ వ్యవహార శైలి ఎలా ఉంది అన్నది అందరికీ అర్ధమైన పరిస్థితి. ఇదిలా ఉండగా మూడేళ్ళ ఏలుబడిలో జగన్ సీఎం గా ఎంతవరకూ సక్సెస్ అయ్యారు అన్నది కనుక సమీక్షిస్తే ఆయన అనుకున్నవి కూడా చాలా చేయలేకపోయరు అన్న జవాబు వస్తుంది.
అలాగే దూకుడుతో వెళ్ళి అనేక చిక్కులు తెచ్చుకున్న సందర్భాలు కూడా కనిపించాయి. ఎన్నికల మ్యానిఫేస్టోను పూర్తిగా అమలు చేశాను అని చెప్పుకుంటున్నా అందులో కూడా కొన్ని అలా వదిలేసిన సందర్భం కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ రద్దు చేసే విషయంలో మాట ఇచ్చి తప్పారు అని విమర్శలు ఉన్నాయి.
ఇక సంక్షేమ పధకాలు కొన్ని చెప్పి తరువాత కండిషన్లు పెట్టి చాలా మందిని తపించారు అని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే కరోనా ఉన్నా కూడా ఎలాగోలా సంక్షేమాన్ని జగన్ కొనసాగించారు అని చెప్పుకోవచ్చు. అయితే అప్పుల పాలు రాష్ట్రం అవుతున్నా పట్టించుకోకపోవడమే అతి పెద్ద తప్పుగా అంతా భావిస్తున్నారు.
ఏపీకి అసలే ఆదాయం లేదు, అలాంటి ఏపీ కరోనా దెబ్బకు విలవిలలాడింది. ఆ సమయంలో కూడా అప్పులు మరింత చేయడం ద్వారా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని ఇంకా దిగజార్చారు అని విమర్శలు ఉన్నాయి. పెట్టుబడుల ద్వారా ఏపీకి ఎంతో మేలు చేకూర్చే విధానాలను అనుసరించలేదని, ఇక చివరి రెండేళ్ళు ఉందనగా దావోస్ వెళ్ళిన వైసీపీ పెద్దలు సాధించేది ఏముంటుందన్న విమర్శలు ఉన్నాయి.
అలాగే అభివృద్ధి అన్నది లేకపోవడం కూడా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్న పరిస్థితి. ఏపీలో రోడ్లు కూడా దారుణంగా ఉండడం కూడా ప్రభుత్వ ఉదాశీనతకు అద్దం పడుతోంది అని అంటున్నారు. కేవలం సంక్షేమాన్నే నమ్ముకుని ఇంతకాలం ఒక వైపే చూసిన వైసీపీ పాలకుల తీరు వల్ల మూడేళ్ళకే తీరని వ్యతిరేకతను మూటకట్టుకున్నారు అని అంటున్నారు.
గ్రాఫ్ ఒక్కసారిగా తల్లకిందులు కావడంతో వైసీపీ ఇపుడు అభివృద్ధి మంత్రం వల్లిస్తోంది. కానీ ప్రభుత్వం ఎన్ని చేసినా రానున్న రెండేళ్ళలో ఏపీ దశ దిశను మార్చే పరిస్థితి అయితే కనిపించడంలేదు. మరో వైపు సామాజిక న్యాయం పేరిట చేస్తున్న విన్యాసాలు, ఓట్ల రాజకీయంగానే అంతా అర్ధం చేసుకుంటుంటున్నారు. దాంతో వచ్చే ఎన్నికల వేళకు ఏ రకమైన నినాదాన్ని ఎంచుకుని జనాల్లోకి వెళ్ళాలి అన్నది కూడా వైసీపీ పెద్దలకు అర్ధం కావడం లేదు అంటున్నారు.
ఇక మూడు రాజధానుల వ్యవహారం మొదట్లో వైసీపీకి కలసివచ్చినట్లుగా కనిపించినా అది కాస్తా చివరికి బూమరాంగ్ అయింది. ఇపుడు అమరావతి విషయంలో హై కోర్టు ఇచ్చిన తీర్పు కారణంగా ఏపీలోని అయిదు కోట్ల మంది ప్రజానీకం కూడా మూడేళ్ళుగా ప్రభుత్వం అనుసరించిన విధానం తప్పు అనే అంటున్న పరిస్థితి ఉంది. ఈ రోజుకీ ఏపీకి రాజధాని ఏదీ అన్న డౌట్ ని కంటిన్యూ చేస్తూ పాలకులు పోతున్న పోకడల వల్ల అది చివరికి వైసీపీకే రాజకీయ ఇబ్బందిగా మారే అవకాశం ఉందని అంటున్నారు.
పోలవరం వ్యవహారంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నపుడు చెప్పిన మాట ఒకటి. నాడు చంద్రబాబు కేంద్రం వద్ద నుంచి పోలవరం ప్రాజెక్ట్ ఎందుకు తీసుకున్నారు అని అడిగిన జగన్ ఇపుడు తన మూడేళ్ళ పాలనలో రాష్ట్ర ప్రభుత్వం ఆద్వర్యంలోనే నిర్వహిస్తున్నారు. ఇపుడు చూస్తే పోలవరం ఎపుడు పూర్తి అవుతుందో తెలియని పరిస్థితి. ఇది అతి పెద్ద ఫెయిల్యూర్ గా కూడా మిగలబోతోంది అంటున్నారు.
అలాగే ప్రత్యేక హోదా విషయంలో కూడా జగన్ని నమ్మి పూర్తి మెజారిటీ ఇచ్చి ఎంపీలను గెలిపిస్తే ఆ విషయం కేంద్రం వద్ద గట్టిగా ప్రస్థావించడంలేదన్న ఆవేదన అయితే అందరిలో ఉంది. అలాగే విభజన హామీల విషయంలో కేంద్రం మీద వత్తిడి పెట్టడం కానీ తెలంగాణా నుంచి ఏపీ నుంచి రావాల్సిన ఆస్తుల విషయంలో మూడేళ్ళుగా చేసింది కానీ ఏమీ లేదని కూడా విమర్శలు ఉన్నాయి.
మొత్తానికి ఒకే ఒక విషయం మీదనే ఫోకస్ పెట్టి విలువైన మూడేళ్ళ కాలాన్ని జగన్ గడిపేశారా అంటే జవాబు అవును అనే వస్తోంది. ఇక మిగిలింది రెండేళ్ళు, ఇందులో ఎన్నికల ఏడాది చివరి ఏడాది పోతే అక్షరాలా మిగిలింది ఒక ఏడాది మాత్రమే. ఈ ఏడాదిలో అన్నీ చక్కదిద్దుకుని వైసీపీ పెద్దలు జనం ముందుకు రాగలరా అన్నదే ప్రశ్న. దీనికి సమాధానం ఈ ఏడాదిలోనే దొరకవచ్చు.