Begin typing your search above and press return to search.
ఎనిమిదేళ్లలో మనోళ్లు 30 మంది చనిపోయారు
By: Tupaki Desk | 26 Feb 2017 4:27 AM GMTతప్పు చేస్తేనో.. నేరం చేసినందుకో మరణిస్తే.. ఎవరూ ఏమీ అనుకోరు.కానీ.. విద్వేషం.. జాత్యాంహకారంతో ముక్కపచ్చలారని వారు మరణిస్తే ఆ బాధ ఎంతో మాటల్లో చెప్పలేనిది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ప్రతి చిన్న విషయానికి మనోళ్లు బలి కావటం ఆందోళన కలిగించే అంశం. గడిచిన రెండు వారాల వ్యవధిలో మన తెలుగోళ్లు ఇద్దరు మరణించటం.. ఈ రెండూ అర్థం లేని ఆవేశంతో.. జాత్యాంహకారంతోనే కావటం గమనార్హం. తాజాగా కూఛిబొట్ల శ్రీనివాస్ హత్య ఉదంతం.. ఆయన పక్కనే ఉండి తూటాల తాకిడికి గాయపడి.. చికిత్స పొందుతున్న అలోక్ ఉదంతాలు ఇప్పుడు అందరిలోనూ కొత్త ఆందోళనల్ని తెర మీదకు తెస్తున్నాయ్.
గడిచిన ఎనిమిదేళ్లుగా తెలంగాణ.. ఆంధ్రా ప్రాంతాలకు చెందిన 30 మంది తెలుగోళ్లు హత్యకు గురికావటమో.. బలవన్మరణాలకు పాల్పడటమో.. అనుమానాస్పద రీతిలో మరణించిన వైనాలు.. ఆయా కుటుంబాలకు అంతులేని శోకాల్ని.. గుండె కోతను మిగిలుస్తున్నాయ్. తాజా ఉదంతంలో.. శ్రీనివాస్ హత్య మొత్తం జాత్యాంహకారం కారణంగానే చోటు చేసుకుందన్న విషయం స్పష్టమవుతోంది.
ఇదేమీ సాదాసీదా వ్యవహారం కాదన్న విషయాన్ని ట్రంప్ సర్కారే గుర్తించిందన్న వాదన వినిపిస్తోంది. ఎందుకంటే.. శ్రీనివాస్ మరణాన్ని వైట్ హౌస్ సైతం వివరణ ఇవ్వాల్సి రావటాన్ని మర్చిపోకూడదు. మా కంటేమీరేం గొప్ప.. మీరు మా దేశాన్ని వదిలేసి వెళ్లండంటూ తీవ్ర ఆగ్రహంతో విచక్షణారహితంగా కాల్పులు జరిపిన వైనం చూస్తే.. తలకెక్కిన జాత్యాంహకారం ఏ స్థాయిలో ఉందన్నది ఇట్టే అర్థమవుతుంది. కేవలం నెల వ్యవధిలో.. ఆ మాటకు వస్తే రెండు వారాల వ్యవధిలో జాత్యాంహకార ఘటనల కారణంగా ప్రాణాలు కోల్పోవటం ఇది రెండో ఉదంతమని చెప్పాలి.
మాజీ నావికాదళ సభ్యుడైన వ్యక్తి జరిపిన కాల్పుల్లో శ్రీనివాస్ కూఛిబొట్ట మరణించగా.. మరో ఘటనలో వంశీరెడ్డి కాలిఫోర్పియాలో ఈ నెల 10న మరణించటం మర్చిపోలేం. కారు చిన్నగా తాకిందన్న కారణంతో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. తుపాకీతో కాల్చేయటం షాకింగ్ గా మారింది. ఈ రెండు ఘటనలే కాదు.. గడిచిన ఎనిమిదేళ్లలో విషాదాలు భారీగానే చోటు చేసుకున్నాయని చెప్పాలి.
గడిచిన ఎనిమిదేళ్లలో రెండు రాష్ట్రాలకు చెందిన 30 మంది తెలుగువాళ్లు ప్రాణాలు కోల్పోవటం.. అది కూడా నేరాల కారణంగా.. యాక్సిడెంట్ల కారణంగా కావటం మర్చిపోకూడదు. కోటి కలలతో అమెరికాకు వెళ్లిన తమ వాళ్లు.. విగతజీవులుగా మారటంపై పలువురు ప్రశ్నలవర్షం కురిపిస్తున్నారు. గత ఏడాది డిసెంబరులో విజయవాడకు చెందిన సాయి తేజశ్విని రోడ్డు ప్రమాదంలో మరణించారు. అంతకు ఆర్నెల్ల ముందు.. అంటే.. జులై ప్రాంతంలో పాతికేళ్ల సంకీర్త్ ను సొంత రూమ్మేట్ హత్య చేసిన వైనం సంచలనం రేకెత్తించింది. టెక్సాస్ లోని ఆస్టిన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఆరిజోనా ప్రాంతంలో గత జూన్ లో నంబూరి శ్రీదత్తా స్నేహితులతో వాటర్ ఫాల్స్ వద్దకు వెళ్లిన వేళ మృత్యుముఖంలోకి జారిపోయారు. మరో ఉదంతంలో గతేడాది మదట్లో 23 ఏళ్ల శివకరణ్.. డిప్రెషన్ కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లుగా చెబుతారు.నార్త్ కెరలినో రాష్ట్రంలో మాస్టర్స్ పోగ్రామ్ చేస్తున్నారు. ఇక.. 2015లో23 ఏళ్ల సాయి కిరణ్ హైదరాబాదీ దొంగ చేతిలో హత్యకు గురికావటం.. ఇలాంటి ఘటనే 2014లో 22 ఏళ్ల జయచంద్ర కూడా మృతి చెందారు. ఇక.. ఆర్థిక మాంద్యం జోరుగా ఉన్న 2008.. 2009లలో పెద్ద ఎత్తున నేరాలుచోటు చేసుకోవటం.. అందులో మన తెలుగువాళ్లు టార్గెట్ కావటాన్ని మర్చిపోలేం.
ఒక అంచనా ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆరులక్షల మంది అమెరికా వ్యాప్తంగా ఉన్నట్లు చెబుతున్నారు. వీరిలో ఎక్కువమంది విద్యార్థులు.. ఐటీ ఉద్యోగులు.. ఇంజనీర్లు.. వైద్యులు..బిజినెస్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నారు. అమెరికాలో నేర సంస్కృతి ఎక్కువగా ఉండటం.. గన్ కల్చర్ విరివిగా వాడే నేపథ్యంలో.. ఆచితూచి వ్యవహరించాలే తప్పించి.. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ప్రాణాల మీదకు తెచ్చుకోవటమేకాదు.. వారి మీదనే ప్రాణాలు పెట్టుకుంటున్న వారందరికి తీరని శోకాన్ని మిగులుస్తున్నారన్న విషయాన్ని మర్చిపోకూడదు. వరుసగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో.. అమెరికాలో ఉంటున్న తెలుగు వారు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలన్నది మర్చిపోకూడదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/