Begin typing your search above and press return to search.
కొత్త జిల్లాలు 25 కావు.. 30నా..?
By: Tupaki Desk | 8 Jun 2016 4:29 AM GMTతెలంగాణ రాష్ట్రంలో కొత్తగా తీసుకొచ్చే జిల్లాలతో మొత్తం జిల్లాలు ఎన్ని ఉండనున్నాయన్న ప్రశ్నను సంధిస్తే.. మరో ఆలోచన లేకుండా పాతిక అని చెప్పేస్తారు. కానీ.. తాజాగా ముఖ్య అధికారులు చేసిన కసరత్తు ప్రకారం పాతిక కాకుండా 30 జిల్లాల్ని ప్రతిపాదన చేస్తున్నట్లుగా చెబుతున్నారు. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకూ దాదాపు ఏడున్నర గంటల పాటు పది జిల్లాల కలెక్టర్లు.. సీఎం పేషీ కీలక అధికారులైన రేమండ్ పీటర్.. నర్సింగరావు.. బీఆర్ మీనా.. స్మితా సభర్వాల్ లు భేటీ కావటం.. కలెక్టర్లు తమ తమ ప్రజంటేషన్లు ప్రదర్శించారు. అనంతరం కలెక్టర్ల ప్రజంటేషన్లపై కీలక అధికారుల మధ్య భేటీ జరిగింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇప్పటివరకూ వినిపిస్తున్నట్లుగా పాతిక జిల్లాల స్థానంలో కలెక్టర్లు కొత్తగా మరో 20 జిల్లాల్ని ప్రతిపాదించినట్లు చెబుతున్నారు. అంటే..ఇప్పుడున్న పది జిల్లాలకు అదనంగా ఇరవై జిల్లాలు అంటే మొత్తం 30 జిల్లాలుగా చెప్పొచ్చు.
మొదట్లో అనుకున్న దానికి భిన్నంగా పలు జిల్లాల కలెక్టర్లు కొత్త జిల్లాలకు సంబంధించిన తమదైన ప్రతిపాదనలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకూ కరీంనగర్ జిల్లాలో జగిత్యాలను కొత్త జిల్లాగా అనుకోగా.. తాజాగా దానికి అదనంగా సిరిసిల్ల జిల్లాను కూడా ఏర్పాటు చేయాలన్న సూచన చేసినట్లుగా తెలుస్తోంది. అదే విధంగా మహబూబ్ నగర్ జిల్లా విషయానికి వస్తే వనపర్తి.. నాగర్ కర్నూలుతో పాటు గద్వాల.. నారాయణపేటల్లో ఒక జిల్లా అనుకూలమని అభిప్రాయపడినట్లుగా తెలుస్తోంది.
రంగారెడ్డి.. హైదరాబాద్ జిల్లాల్లో రెండేసి చొప్పున కొత్త జిల్లాలతో పాటు శివారు మొత్తం మరో జిల్లాగా ప్రతిపాదించినట్లు సమాచారం. నల్గొండ.. వరంగల్.. మెదక్.. అదిలాబాద్ జిల్లాల్లో రెండేసి కొత్త జిల్లాలు అనుకూలమని.. నిజామాబాద్. . ఖమ్మం జిల్లాల్లో ఒక్కొ జిల్లా అదనంగా అవసరమన్న ప్రతిపాదన ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మొత్తంగా జిల్లాలు పాతిక కావు.. 30 అయినట్లుగా సమాచారం. అయితే.. ముఖ్యమంత్రి చెప్పినట్లుగా ఈ 30 కొత్త జిల్లాలను కుదించి పాతిక జిల్లాలకు సంబంధించిన ప్రతిపాదనల్ని కేసీఆర్ కు చూపిస్తారా? లేక.. 30 జిల్లాల ప్రతిపాదనల్ని ప్రదర్శించి సీఎం నిర్ణయం తీసుకుంటారా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
ఒక కొత్త జిల్లాలకు సంబంధించిన కొన్ని అంశాలు కీలక ప్రతిపాదనలు వచ్చినట్లుగా చెబుతున్నారు. కొత్త జిల్లాలు ఏవైనా.. జిల్లా ప్రధాన కేంద్రానికి 70 కిలోమీటర్ల పరిధిలో ఉండేలా చేయాలని.. కొత్త జిల్లాల నేపథ్యంలో కొత్త మండలాల్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు జోరుగా వినిపిస్తున్నాయి. అంతే కాదు ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఒకే జిల్లాలో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నా.. కొన్ని జిల్లాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాలు రెండేసి జిల్లాల్లో ఉండటం ఇబ్బందికరంగా మారిందని చెబుతున్నారు. సీఎం కేసీఆర్ తో భేటీ అనంతరం కొత్త జిల్లాల వ్యవహారంపై స్పష్టత వస్తుందని చెప్పొచ్చు.