Begin typing your search above and press return to search.
పన్ను ఎగ్గొట్టిన తెలుగోళ్ల లిస్ట్ ఇదే!
By: Tupaki Desk | 6 Aug 2017 9:10 AM GMTపన్ను ఎగ్గొట్టటం అంటే ప్రజాసొమ్మును లూటీ చేయటం లాంటిదే. కోట్లాది రూపాయిల పన్ను మొత్తాన్ని ఎగ్గొట్టిన బడాబాబుల లెక్క గుట్టు రట్టు కావటం తెలిసిందే. పెద్ద ఎత్తున పన్ను మొత్తాన్ని ఎగ్గొట్టిన వారికి సంబంధించిన వివరాల్ని ఆదాయపన్ను శాఖ ఇటీవల వెల్లడించటం తెలిసిందే.
భారీ మొత్తంలో పన్ను కట్టకుండా ఎగ్గొట్టిన 96 మంది వివరాల్ని వెల్లడించింది. వీరంతా రూ.3896.53 కోట్ల మేర పన్ను ఎగ్గొట్టిన వైనం బయటకు వచ్చింది. ఈ 96 మందిలో తెలుగువారు 30 మంది ఉన్నారు. తెలుగు వారి వరకూ పన్ను ఎగ్గొట్టిన మొత్తం లెక్క చూస్తే అది ఏకంగా రూ.1045.92 కోట్లు ఉన్నట్లుగా తేలింది.
పన్ను ఎగ్గొట్టిన బడా బాబుల్లో నెంబర్ వన్ ప్లేస్ ముంబయికి చెందిన ఉదయ్ ఎం ఆచార్యగా తేలింది. ఈ ఒక్కడే రూ.779.04 కోట్లు పన్ను మొత్తాన్ని ఎగ్గొట్టినట్లుగా ఐటీ శాఖ పేర్కొంది. ఇతడి నుంచి పన్ను ఎగవేత మొత్తాన్ని రికవరీ చేయటానికి ఇతని దగ్గర తగినన్ని ఆస్తులు లేకపోవటంతో ఐటీ శాఖ ఏమీ చేయలేకపోతోంది.
అదే సమయంలో హైదరాబాద్ కు చెందిన టోటెం ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ రూ.400 కోట్లతో రెండో స్థానంలో నిలవటం గమనార్హం. ఈ కంపెనీకి చెందిన వారు కూడా పత్తా లేకుండా పోయారు. కాంట్రాక్టులు చేసే ఈ సంస్థ 2006-12 మధ్య కాలంలో భారీగా పన్ను కట్టలేదని ఐటీశాఖ పేర్కొంది. ఇక.. తెలుగు రాష్ట్రాలకు చెందిన 30 మంది పన్ను ఎగ్గొట్టిన వారి పేర్లు చూస్తే.. ప్రజాధనాన్ని ఎంత దర్జాగా దోచుకున్నది ఇట్టే అర్థమవుతుంది.