Begin typing your search above and press return to search.
ప్రియురాలికి సారీ చెబితే పోలీసులు కేసు పెట్టారు
By: Tupaki Desk | 19 Aug 2018 1:30 AM GMTమహారాష్ట్రలోని పింప్రి చించ్ వాడ్ పట్టణంలో ఓ కుర్రాడు తన ప్రియురాలిని బుజ్జగించడానికి చేసిన పని ఆయన్ను ఇరకాటంలో పెట్టింది. ప్రియురాలితో చిన్నపాటి గొడవ తరువాత ఆమె మాట్లాడడం మానేసింది. ఎంత ప్రయత్నించినా ఆమె అసలు ఈ కుర్రాడిని కలవనివ్వడమే లేదట.. మాట్లాడే అవకాశమే ఇవ్వడం లేదట. దీంతో సారీ చెబుదామన్న అతని ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో ఏకంగా భారీ ప్లాన్ వేశాడు. రూ.72 వేలు ఖర్చు చేసి ఊరు ఊరంతా 300 ఫ్లెక్సీలు పెట్టి అన్నిట్లోనూ ఆమెకు సారీ చెబుతూ తన బాధ వెళ్లగక్కాడు. దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ నోటా ఈనోటా పడి చివరికి పోలీసులకు చేరింది. అనుమతుల్లేకుండా హోర్డింగులు పెట్టకూడదని అక్కడ నిబంధనలు ఉండడంతో అందుకు విరుద్ధంగా వ్యవహరించిన ప్రియుడిపై వారు కేసు పెట్టారు.
పింప్రి చించ్ వాడ్ పట్టణ ప్రజలు మొన్న శుక్రవారం నిద్రలేచి బయటకొచ్చేసరికి ఎక్కడ చూసినా ‘శివ్‌దే ఐయామ్ సారీ’ అంటూ లవ్ సింబల్ తో పెద్ద పెద్ద ప్లెక్సీలు కనిపించాయట. ముఖ్యంగా ఆ ప్రాంతంలోని అన్ని ప్రధాన ప్రాంతాలు, రద్దీ కూడళ్లలో ఈ బ్యానర్లు కనిపించాయట. విచిత్రంగా ఉండడంతో అందరూ తమ మొబైళ్లలో ఫొటోలు తీసి షేర్ చేయడం మొదలుపెట్టారు. దీంతోఇది వైరల్ గా మారిపోయింది.
ఈ ఫ్లెక్సీల వెనుక నీలేష్ ఖేడేకర్ అనే పాతికేళ్ల కుర్రాడున్నాడు. లోకల్‌గా ఈ కుర్రాడు వ్యాపారం చేస్తుంటాడు. శివ్‌దే అనే అమ్మాయితో లవ్. అయితే, ఇద్దరి మధ్యా గొడవ జరిగాయ ఆమె నీలేశ్ ఫోన్‌కు రెస్సాండ్ కావడం లేదట. దీంతో ఆమెకు ఎలాగైనా సారీ చెప్పాలని తన ఫ్రెండ్సుతో కలిసి ఇలా ప్లాన్ చేశాడట. శుక్రవారం ఆమె ముంబయినుంచి పింప్రి వస్తుందని తెలిసి ఆమె వచ్చే దారిలో ఈ ఫ్లెక్సీలు పెట్టించాడు. ఆమె వచ్చిందో రాలేదో.. చూసిందో చూళ్లేదో తెలియదు కానీ నీలేశ్‌ను మాత్రం పోలీసులు పట్టుకున్నారు. అంతేకాదు... ఫ్లెక్సీలు ప్రింటు చేసిన దుకాణదారును.. నీలేశ్‌కు సహకరించిన మిత్రులపైనా పోలీసులు కేస్ పెట్టారు.