Begin typing your search above and press return to search.
300 ఇంజినీరింగ్ కాలేజీలు మూత
By: Tupaki Desk | 3 Dec 2017 9:27 AM GMTగాడి తప్పిన ఉన్నత విద్య గురించి మరో కలకలమైన వార్త తెరమీదకు వచ్చింది. దేశ వ్యాప్తంగా 300లకు పైగా ప్రయివేటు ఇంజినీరింగ్ కళాశాలలు త్వరలో మూతబడనున్నాయి. ఇందులో తెలుగు రాష్ర్టాల్లో కూడా భారీ సంఖ్యలోనే ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయి.2018-19 విద్యా సంవత్సరానికి గానూ..ఈ కళాశాలలు ఎలాంటి అడ్మిషన్లు ప్రక్రియ చేపట్టవద్దని కేంద్ర మానవ వనరుల శాఖ సూచించినట్లు సమాచారం. గత ఐదేళ్లుగా సదరు కళాశాలల్లో ప్రవేశాలు తగ్గిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్రం మానవ వనరుల శాఖ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) వెబ్‌సైట్ ప్రకారం భారతదేశంలో దాదాపు 3,000 ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలలో మొత్తంగా 13.56 లక్షల సీట్లు ఉన్నాయి. వీటిలో దాదాపు 800 కాలేజీలలో ఎన్ రోల్ మెంట్ శాతం 50 శాతానికి కంటే తక్కు వగా ఉంది. అంతేకాక 300 కాలేజీలలో 150కి పైగా కాలేజీలు 20 శాతం కన్నా తక్కువ ఎన్‌రోల్‌మెంట్ కలిగి ఉన్నాయి. దాంతో అలాంటి కాలేజీలను ఇంజినీరింగ్ కాలేజీలుగా కొనసాగవద్దని మానవ వనరుల శాఖ(హెచ్‌ఆర్‌డీ) ఆదేశించనున్నట్టు మానవ వనరుల శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ కాలేజీలకు సైన్స్ కళాశాలలు లేదా ఒకేషనల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ గా మార్చుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. అంతేగాక.. ప్రవేశాలు తక్కువగా ఉన్న మరో 500 ఇంజినీరింగ్ కాలేజీలపై నిఘా పెట్టినట్లు సమాచారం.
కాగా, సెప్టెంబర్ మొదట్లో దేశ వ్యాప్తంగా 800 ఇంజినీరింగ్ కాలేజీలకు మూతవేయాలని ఏఐసీటీఈ ఆశించింది. ఆ కాలేజీల్లో చేరడానికి విద్యార్థులు ముందుకు రావడంలేదు. అడ్మిషన్లు లేకపోవడంతో సదరు కాలేజీలు సతమవుతున్నాయి. అంతకుమునుపు అంటే 2014-15 నుంచి 2017-18 వరకు దేశవ్యాప్తంగా 410కి పైగా కాలేజీల మూసివేతకు ఏఐసీటీఈ ఆమోదించింది. వాటిలో 20 కాలేజీలు కర్నాటకలో ఉన్నాయి. 2016-17 లో అధిక సంఖ్యలో కాలేజీల మూసివేతకు ఆమోద ముద్ర పడింది. మూతపడేందుకు సిద్ధంగా ఉన్న వాటిలో గరిష్ఠంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ - తమిళనాడు - మహారాష్ట్ర - గుజరాత్ - హర్యానా - మధ్యప్రదేశ్ - రాజస్థాన్ - ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయని సమాచారం. ఇందులో ఆంధ్రప్రదేశ్ - తెలంగాణలకు సంబంధించి దాదాపు 30 నుంచి 50 కాలేజీలున్నట్లు తెలుస్తోంది.