Begin typing your search above and press return to search.
డిజిటల్ ఇండియా ఎఫెక్ట్.. విప్రోలో 300 మంది ఉద్యోగాలు ఎలా పోయాయంటే!
By: Tupaki Desk | 11 Oct 2022 11:30 PM GMTప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ `విప్రో`లో ఇటీవల 300 మంది ఉద్యోగులను పక్కన పెట్టారు. అంటే.. వారిని ఉద్యోగాల నుంచి తీసేశారు. దీనికి కారణం.. విప్రోలో పనిచేస్తూనే మరింత ఆదాయం కోసం వేరే కంపెనీలో పనిచేయడం. ఇలా చేస్తున్న వారిని `విప్రో` గుర్తించింది. మొత్తం 300 మందిపై వేటు వేసింది. అయితే.. వీరిని `మూన్ లైటర్లు`గా పేర్కొంటున్నారు. ఒకింత చిత్రంగా ఉన్నా.. ఈ పదం వినియోగం ఐటీ పరిశ్రమలో కొత్తేం కాదని అంటున్నారు పరిశీలకులు.
సరే.. ఇక, ఏదైనా ఒక కంపెనీలో భారీ వేతనాలకు పనిచేస్తున్నవారు.. అదేసమయంలో వేరే కంపెనీలో పనిచేయడాన్ని అస్సలు ఒప్పుకోరు. దీనిని చాలా తీవ్రంగా పరిగణిస్తారు. ఇప్పుడు విప్రో ఆ పనే చేసింది. అయితే.. ఈ 300 మందిని ఎలా గుర్తించింది? అనేది ప్రధాన చర్చనీయాంశం. మూన్‌లైటర్‌లను గుర్తించడం.. ఎలా సాధ్యం అనేది కూడా ప్రశ్నే.
విషయం ఏంటంటే..
ఈ మూన్‌లైటింగ్ వ్యవహారంపై రాజీవ్ మెహతా అనే స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ అసలు వాస్తవం వెల్లడించారు. ‘‘ఇంటి నుంచే పనిచేసే ఐటీ ఉద్యోగులు.. వర్క్ ఫ్రమ్ హోం సదుపాయం ఉన్న మరో కంపెనీలో ఏకకాలంలో పనిచేయడమే మూన్‌లైటింగ్. రెండు ల్యాప్‌ట్యాప్‌లు, ఒకే వైఫై, ఇద్దరు క్లయింట్లు.. ఒకే పని.. రెట్టింపు డెలివరీ.. ఇదంతా సౌకర్యంగా తన ఇంటినుంచే. ఎలాంటి అనుమానం రాకుండా రెండు చోట్లా ఉద్యోగాలు చేయడం అన్నమాట. ఇలాంటి వారిని పట్టుకోవడం అసాధ్యమే! చాలా కష్టం కూడా. మరి వారిని విప్రో సంస్థ ఎలా కనిపెట్టింది? అంటే.. కేవలం పీఎఫ్(ప్రావిడెంట్ ఫండ్) ద్వారా`` అని రాజీవ్ పేర్కొన్నారు.
‘‘కంపెనీలు తమ ఉద్యోగులకు పీఎఫ్ జమ చేయడం కేంద్రం తప్పనిసరి చేసింది. శాలరీ అకౌంటర్ల కోసం కంపెనీలు ఉద్యోగుల నుంచి ఆధార్, పాన్ నంబర్లు తీసుకుంటాయి. వాటినే పీఎఫ్ జమకూ ఉపయోగిస్తాయి. ప్రస్తుతమున్న వ్యవస్థల్లో మూన్‌లైటర్లకు ఆర్థికంగా, భౌతికంగా రెండు వేర్వేరు గుర్తింపులను సృష్టించుకోవడం సాధ్యం కాదు. ఇక, పీఎఫ్ సంస్థ కూడా ఎప్పటికప్పుడు డీ-డుప్లికేషన్ అల్గారిథమ్‌ను ఉపయోగిస్తుంటుంది. పొరబాటుగా ఎవరి ఖాతాలోనైనా ఎక్కువసార్లు పీఎఫ్ జమ అయిందో లేదో చెక్ చేస్తుంటుంది. ఇటీవల అలా చేసిన తనిఖీల్లో కొందరు వ్యక్తుల ఖాతాలు అనుమానాస్పదంగా కన్పించాయి. ఒకే ఖాతాల్లో ఒకటి కంటే ఎక్కువ కంపెనీలు జమ చేసినట్లు గుర్తించారు. వెంటనే ఆ సమాచారాన్ని ఆయా కంపెనీలకు చేరవేసింది. `డిజిటల్ ఇండియా` పవర్ అంటే ఇదే. క్షేత్రస్థాయి నుంచే అవినీతిని నిర్మూలించడంలో డిజిటల్ ఇండియా కీలక పాత్ర పోషిస్తుంది’’ అని రాజీవ్ వివరించారు.
అయితే, ఈ థియరీ గురించి తనకు ఎలా తెలుసు? దీనికి సంబంధించి తన వద్ద ఏమైనా సాక్ష్యాలున్నాయా? అన్న వివరాలను మాత్రం రాజీవ్ చెప్పలేదు. కాగా.. ఈ వివరణపై పీఎఫ్ సంస్థ నుంచి ఎలాంటి అధికారిక స్పందనా రాలేదు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అనేక మంది దీనిపై కామెంట్లు చేస్తున్నారు.
మూన్‌లైటింగ్‌కు పాల్పడిన 300 మంది ఉద్యోగులను తొలగించిన తర్వాత విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీపై ఇటీవల సోషల్‌మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే వాటిపై ఆయన తీవ్రంగా స్పందించారు. మూన్‌లైటింగ్ అనేది ఏ రూపంలో ఉన్నా నైతిక ఉల్లంఘనకు పాల్పడినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. మరో ఉద్యోగం చేయడమంటే కంపెనీని మోసగించడమేనని మండిపడ్డారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.