Begin typing your search above and press return to search.

దారుణం: మహిళా టిక్ టాకర్ పై 300 మంది దాడి

By:  Tupaki Desk   |   18 Aug 2021 5:30 PM GMT
దారుణం: మహిళా టిక్ టాకర్ పై 300 మంది దాడి
X
మత చాందసవాదంతో అట్టుడికే పాకిస్తాన్ లో ఆడవారికి హక్కులు లేకుండా పోతున్నాయి. స్వేచ్చగా.. సమానత్వంతో మహిళలు బతికే రోజులు పోయాయి. పాకిస్తాన్ లో ఈ మేరకు దారుణం జరిగింది. ఓ మహిళా టిక్ టాకర్ పై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

ఆగస్టు14 పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఓ టిక్ టాకర్ తన ఆరుగురు స్నేహితులతో కలిసి లాహోర్ లోని మినార్-ఇ-పాకిస్తాన్ వద్ద టిక్ టాక్ వీడియోను చిత్రీకరించాలనుకున్నారు. ఆ సమయంలో సుమారు 300 మంది ఆమెను చుట్టుముట్టి దాడికి పాల్పడ్డారు.

ఆమెను గాల్లోకి ఎగురవేస్తూ దుస్తులు చించడానికి యత్నించారు. ఆమె చుట్టూ చేరిన వందలాది మంది నుంచి తప్పించుకోవడానికి ఆ మహిళా చాలా ప్రయత్నించింది. కానీ ఎంతకు అది సాధ్యం కాలేదు.

ఈ పరిస్థితి గమనించిన సెక్యూరిటీ గార్డు మినార్-ఇ-పాకిస్తాన్ గేటు తెరవడంతో అక్కడి నుంచి తన స్నేహితులతో ఆమె బయటపడింది. బలవంతంగా ఆమె చేతికి ఉన్న ఉంగరం, చెవి రింగులు, తన స్నేహితుల వద్ద ఉన్న మొబైల్ ఫోన్, ఐడీ కార్డు, రూ.15వేలను లాక్కున్నారు. ఈ ఘటనపై సదురు టిక్ టాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.