Begin typing your search above and press return to search.

30 వేల మంది ఉద్యోగులు ఔట్!

By:  Tupaki Desk   |   14 Oct 2021 6:42 AM GMT
30 వేల మంది ఉద్యోగులు ఔట్!
X
వోక్స్ వాగన్.. కార్ల ప్రియులకు దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఇది ఒక విలావంతమైన కార్ల కంపెనీ.. ఈ బ్రాండ్‌లో మామూలు కార్ల నుంచి లెగ్జరీ కార్ల వరకు అన్నీ దొరుకుతాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇది టెస్లా వంటి పెద్ద కంపెనీలతో పోటీపడుతున్నది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్ కార్లను రిలీజ్ చేస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది.

వీలైనప్పుడల్లా కార్లపై ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తూ అందరినీ తన వైపు తిప్పుకుంటుంది. ఆ కంపెనీ కార్లను చూస్తే ఎవరికైనా అందులో ప్రయాణించాలనే కోరిక కలగకమానదు. ఇంతటి బ్రాండ్ ఇమేజ్ ఉన్న ఈ కంపెనీ మార్కెట్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ కంపెనీ ఇటీవల తన బ్రాండ్ కార్లపై అనేక ఆఫర్స్ ప్రకటించింది. కరోనా కారణంగా ఆటోమోబైల్ రంగం తీవ్ర ఒడిదొడుకులకు గురైంది.

ఫలితంగా కార్ల అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి. దీనికి తోడు ఇతర కంపెనీల నుంచి వచ్చే పోటీనీ తట్టుకునేందుకు రెండు నెలల క్రితం ఈ సంస్థ తన బ్రాండ్ కార్లు కొన్న వారికి వివిధ డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ బ్రాండ్‌కు చెందిన వెంటో కంఫర్ట్ లైన్ కారు ధర సుమారు రూ.10 లక్షలు ఉండగా దీనిపై ఏకంగా లక్షన్నర వరకు డిసౌంట్ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది.

వీటితో పాటు కొన్ని రంగాలకు చెందిన వారికి ప్రత్యేకంగా ఆఫర్లు ఇచ్చింది. వారి కోసం ప్రత్యేకంగా ధరను సైతం తగ్గించి కార్లు అందుబాటులో ఉంచేలా ప్లాన్ చేసింది. సుమారు 55 లక్షలు విలువజేసే కార్లపై సైతం దాదాపుగా రూ. 6 నుంచి రూ. 7 లక్షల వరకు డిస్కౌంట్ ఇచ్చింది. ఇన్ని ప్లాన్స్‌తో కరోనా సమయంలో మార్కెట్‌లో నిలదొక్కుకునే ప్రయత్నం చేసింది.

ప్రస్తుతం వోక్స్ వాగన్ కంపెనీ పలు కీలకమైన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఓ వైపు ఖర్చులు పెరుగుతుండటంతో పాటు, మరో వైపు మిగతా కార్లు కంపెనీల పోటీని తట్టుకునేందుకు సంచలన నిర్ణయం తీసుకునేందుకు ముందడుగు వేస్తోంది. ప్రస్తుతం పెరుగుతున్న ఖర్చును తగ్గించుకునేందుకు, టెస్టా వంటి ఈవీ (ఎలక్ట్రిక్ వెహికిల్) వంటి సంస్థ పోటీనిచ్చేందుకు తీసుకున్న నిర్ణయంలో భాగంగా భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం.

దాదాపు 30వేల మంది ఉద్యోగాలు కోల్పోనున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సూపర్ వైజరీబోర్టుకు వోక్స్ వాగన్ కంపెనీ సీఈవో హెర్బర్ట్ డైసెస్ ఓ ప్రెజంటేషన్ సైతం ఇచ్చారని డెయిలీహండెల్స్ బ్లాట్(జర్మన్) ఓ కథనం ద్వారా వెల్లడించింది. ఈ వార్తలపై స్పందించిన మైకెల్.. మార్కెట్‌లో కొత్తకొత్తగా వస్తున్న కంపెనీలను గట్టిపోటీని ఇచ్చేందుకు ఎలాంటి రాజీ పడబోమన్నారు. దీనికి సంబంధించిన ఆలోచనలు చాలానే ఉన్నాయని వాటికి తుదిరూపు ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు.

ఉద్యోగాల తొలగింపుపై మాత్రం కంపెనీ అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి విషయం ప్రకటించలేదు. మరి ఉద్యోగుల విషయంలో వోక్స్ వాగన్ కఠినంగా వ్యవహరిస్తూ వారిని తొలగిస్తుందా? లేక వారి పట్ల సానుకూలంగానే వ్యవహరిస్తుందా అనే విషయం తెలియాల్సి ఉంది. దీనికి మరికొంత సమయం పట్టే చాన్స్ ఉన్నదని సమాచారం.