Begin typing your search above and press return to search.
లోయలో పడ్డ బస్సు...32 మంది మృతి!
By: Tupaki Desk | 28 July 2018 11:08 AM GMTమహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సతారాలోని అంబేనలి ఘాట్ రోడ్డులో శనివారంనాడు ఓ టూరిస్ట్ బస్సు లోయలో పడింది. మహాబలేశ్వర్ యాత్రకు వెళ్తున్న ఆ బస్సు ఘాట్ రోడ్డులో అదుపు తప్పి 500 మీటర్ల లోతు లోయలోకి పడిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. ఘాట్ రోడ్డులో బస్సును డ్రైవర్ అదుపు చేయలేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిదని తెలుస్తోంది. . మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని సహాయక బృందాలు చెబుతున్నాయి. ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్ సహా మొత్తం 40 మంది యాత్రికులున్నారని తెలుస్తోంది. ఆ ప్రమాదం నుంచి బయటపడ్డ ఒక వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
కొంకణ్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన సిబ్బంది మహాబలేశ్వర్ విహారయాత్రకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో ఓ వ్యక్తి బస్సులో నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. అతడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకూ 32 మృతదేహాలను బయటకు వెలికి తీశారు. ఆ ప్రాంతంలో భారీ వర్షం కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. అయితే, లోయ లోతు ఎక్కువగా ఉండడంతో బస్సులోని మిగతా ప్రయాణికులంతా చనిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.