Begin typing your search above and press return to search.
ఆ శాఖలో కరోనా కలకలం..32మంది పాజిటివ్
By: Tupaki Desk | 5 July 2020 4:42 AM GMTఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజువారీగా 1000 వరకు కేసులు నమోదవుతున్నాయి. ఇక సీఎం క్యాంప్ ఆఫీస్, సచివాలయం వరకు కూడా కరోనా తీవ్రత కొనసాగుతోంది.
తాజాగా రాష్ట్ర మహిళాభివృద్ధి - శిశు సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయంలో సిబ్బంది పెద్దసంఖ్యలో కరోనా వైరస్ బారినపడడం ఆందోళన కలిగిస్తోంది. ఈ శాఖలో మొత్తం 70మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తుండగా ఇప్పటిదాకా ఏకంగా 32 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.ఈ మేరకు శుక్రవారం రాత్రి వైద్యఆరోగ్యశాఖ నుంచి నివేదికలు వచ్చాయి.
ఇందులోని మొత్తం 70మందికి పరీక్షలు నిర్వహించగా.. 32 మందికి పాజిటివ్, 8మందికి నెగెటివ్ అని తేలింది. మరో 30 మంది పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. పాజిటివ్ వచ్చిన ఉద్యోగులను మంగళగిరి ఆస్పత్రికి తరలించారు. వీరు ఎవరెవరిని కలిశారు. కాంటాక్టులను ఆరాతీస్తున్నారు. కుటుంబ సభ్యులను క్వారంటైన్ చేశారు.
శిశు సంక్షేమ శాఖలో రావడంతో దాని పక్కన ఉన్న మిగతా శాఖల్లోనూ పరీక్షలు చేస్తున్నారు. డ్వామా కార్యాలయంలో ఇద్దరికీ, జడ్పీ కార్యాలయంలో ఇద్దరికీ లక్షణాలు బయటపడ్డాయి. మొత్తంగా ఏపీ సచివాలయంలో కరోనా కలకలం రేగుతోంది.