Begin typing your search above and press return to search.
ఈ చిన్న వంతెన పెద్ద రికార్డునే సృష్టించింది!
By: Tupaki Desk | 30 July 2016 2:30 PM GMTవంతెన ఏమిటి - అది కూడా 32 అడుగులే ఉండటం ఏమిటి.. పైగా ఆ వంతెన రెండు దేశాలను కలపడం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా? నమ్మడానికి ఏమాత్రం అనుకూలంగా లేకపోయినా కచ్చితంగా నమ్మి తీరాల్సిన విషయమిది. ఆ వంతెన కలుపుతున్నది రెండు ఊర్లను కాదు - రెండు జిల్లాలను కాదు అలా అని చిన్న చిన్న దేశాలను కాదు.. అమెరికా - కెనడా లను! ఎన్నో ప్రత్యేకతలున్న ఈ వంతెన సంగతి ఇప్పుడు చూద్దాం!.
న్యూయార్క్ తీరప్రాంతం నుంచి కెనడాలోని ఒంటారియో తీరప్రాంతం వరకూ వందల సంఖ్యలో ఐల్యాండులు ఉన్నాయి. అయితే ఈ ఐల్యాండుల్లో కొన్ని కెనడా ఆధీనంలో ఉంటే.. మరికొన్ని అమెరికా ఆధీనంలో ఉన్నాయి. ఇలా అమెరికా - కెనడాల ఆధీనంలో ఉన్న ఐల్యాండులను కలుపుతూ తాజాగా వంతెనలు నిర్మించారు. వాటిలో ఆమెరికా ఆధీనంలో ఉన్న జవికాన్ ఐలాండ్ కు కెనడాలోని మరో ఐల్యాండ్ కు మధ్య నిర్మించిన వంతెన పొడవు కేవలం 32 అడుగులే వచ్చింది. అంటే.. 32 అడుగులలోనే రెండు దేశాలను కలిపేశారన్నమాట. దీంతో అంతర్జాతీయంగా రెండు దేశాలను కలిపిన అతిచిన్న వంతెనగా ఈ వంతెన రికార్డు సృష్టించింది.