Begin typing your search above and press return to search.

ఏపీలో ఆ ప్రభుత్వ ఆఫీసులో 33 మందికి పాజిటివ్ !

By:  Tupaki Desk   |   7 July 2020 9:15 AM GMT
ఏపీలో ఆ ప్రభుత్వ ఆఫీసులో 33 మందికి పాజిటివ్ !
X
ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకి కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. రాష్ట్రంలో వైరస్ ను అరికట్టడానికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. సామాన్యుల నుండి ప్రముఖుల వరకు అందరూ వైరస్ భారిన పడుతున్నారు. అలాగే ప్రైవేట్ , ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా వైరస్ కలకలం సృష్టిస్తుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో 33 మందికి కరోనా వైరస్ నిర్ధారణ కావడం కలకలం రేపుతోంది. దీంతో ఏకంగా కార్యాలయాన్ని మూసివేశారు. గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది .

గుంటూరు జిల్లా అమరావతి రోడ్డులో ఉన్న మహిళా శిశు సంక్షేమ రాష్ట్ర కార్యాలయంలో ఒకే రోజు 33 మంది ఉద్యోగులకు పాజిటీవ్ వచ్చింది. ముందుగా ఈ కార్యాలయంలో రాష్ట్ర డైరెక్టర్‌కు పాజిటీవ్ వచ్చింది. దీంతో ఆఫీసులో ఉండే 120 మంది ఉద్యోగులకు పరీక్షలు చేయగా.. వారిలో 33 మందికి పాజిటీవ్ నిర్ధారణ అయ్యింది. మిగతా వారిని హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా వైద్యులు సూచించారు. అయితే ఒకేసారి ఓ శాఖ కార్యాలయంలో ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగులు కరోనా బారిన పడటం ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది. దీంతో మిగతా శాఖల ఉద్యోగులు అప్రమత్తమయ్యారు.

కాగా, ఏపీలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా భారీగా టెస్టులు చేస్తుండగా.. కేసులు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. పీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20019 దాటింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10860 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో కరోనా బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 239కి చేరింది