Begin typing your search above and press return to search.
హెరిటేజ్ ప్లాంట్ లో కరోనా కల్లోలం..34 మంది క్వారంటైన్!
By: Tupaki Desk | 29 April 2020 10:10 AM GMTప్రపంచ దేశాలను వణికించేస్తున్న ప్రాణాంతక వైరస్ కరోనా… టీడీపీ అధినేత - ఏపీ విపక్ష నేత నారా చంద్రబాబునాయుడు కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్న కంపెనీకి సోకేసింది. హెరిటేజ్ సంస్థ చంద్రబాబు ఫ్యామిలీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ కంపెనీకి రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో యూనిట్లు ఉన్న సంగతీ తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని ఉప్పల్ ప్రాంతంలో ఉన్న హెరిటేజ్ యూనిట్ లో మంగళవారం కరోనా కలకలం రేగింది.
ఈ యూనిట్ లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఓ యువకుడికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు సదరు యువకుడితో పాటు అతడి తల్లిదండ్రులను కూడా గాంధీ ఆసుపత్రికి తరించేశారు. అయితే , అదే సమయంలో కొంతమందిని హోమ్ క్వారంటైన్ లో ఉండాలని అధికారులు చెప్పగా ..వారిని హెటిరేజ్ యాజమాన్యం ఒత్తిడి తీసుకువచ్చిందన్న వార్తలు గుప్పుమన్నాయి. దీనితో కరోనా అనుమానితులు విధులకు హాజరైతే మిగిలిన ఉద్యోగుల పరిస్థితి - ఆ తర్వాత తమ పరిస్థితి ఏమిటని ఉప్పల్ వాసులు హెరిటేజ్ ఎదుట ఆందోళనకు దిగారట.
దీని పై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. జీహెచ్ ఎంసీ అధికారులు బుధవారం ఉదయం హెరిటేజ్ మిల్క్ సెంటర్ ను పరిశీలించారు. అక్కడ పనిచేస్తున్న 34మంది సిబ్బందిని క్వారంటైన్ కు తరలించారు. మరోవైపు ఉద్యోగులను బెదిరించడంపై జీహెచ్ ఎంసీ అధికారులు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ హెరిటేజ్ మిల్క్ సెంటర్ యాజమాన్యం పై చర్యలు తీసుకుంటామని తెలిపారు.