Begin typing your search above and press return to search.
తెలంగాణలో కల్లోలం: ఒక్కరోజే 352 పాజిటివ్
By: Tupaki Desk | 19 Jun 2020 2:46 AM GMTతెలంగాణలో మహమ్మారి వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. రాష్ట్రంలో వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకు కేసుల పెరుగుదల భారీగా ఉంటోంది. ఈ క్రమంలో తాజాగా గురువారం ఒక్కరోజే ఏకంగా 352 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల్లో అత్యధికంగా 302 కేసులు ఒక్క హైదరాబాద్ పరిధిలోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ముగ్గురు మృతి చెందారు. వీటితో కలిపి మొత్తం కేసులు 6,027కు చేరుకోగా, మొత్తం మృతులు 195.
తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 302 ఉన్నాయి. రంగారెడ్డి 17, మేడ్చల్ 10, మంచిర్యాల 4, జనగామ 3, వరంగల్ అర్చన్ 3, భూపాలపల్లి 2, మహబూబ్‌నగర్ 2, మెదక్ 2, నిజామాబాద్ 2, సంగారెడ్డి 2, వరంగల్ రూరల్, నల్గొండ, ఖమ్మంలో ఒక్కో పాజిటివ్ కేసు నమోదైందని తెలంగాణ వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.
తాజాగా వైరస్ బారిన పడిన వారు గురువారం 230 మంది డిశ్చార్జయ్యారు. వీరితో కలిపి ఇప్పటివరకు 3,301 మంది డిశ్చార్జయ్యారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,531 ఉన్నాయి.