Begin typing your search above and press return to search.

బెంగళూరులో 20 నిమిషాలు.. 36 బస్సులు!

By:  Tupaki Desk   |   13 Sep 2016 7:20 AM GMT
బెంగళూరులో 20 నిమిషాలు.. 36 బస్సులు!
X
కావేరీ జల వివాదం.. కర్ణాటక - తమిళనాడుల్లో చేస్తున్న అలజడి - సృష్టిస్తున్న ప్రకంపనలూ ఇప్పటికే తీవ్రస్థాయికి చేరుకున్నాయి. వ్యక్తులు - హోటల్లపై దాడులు - ఆస్తుల ధ్వంసాలు - పోలీసుల కాల్పులు - అదనపు బలగాల మొహరింపు - 144 సెక్షన్ - కర్ఫ్యూ.. ఇలా చినికి చినికి గాలివానగా మారి ప్రస్తుతం బెంగళూరు మొత్తం అల్లకల్లోలంగా ఉంది. ఈ సమయంలో జరిగిన దాడులు - ఆందోళనకారులు - వారితో చేరిన అల్లరిమూకలో చేసిన పనికి తీవ్రంగా నష్టపోయిన ఒక బాదితుడు తన ఆవేదనను చెప్పుకొచ్చాడు. ఈ దారుణాల్లో తాను ఎలా నష్టపోయింది వివరించారు.

బెంగళూరు నగరంలో కేపీఎన్ ట్రావెల్స్ సంస్థ వ్యవస్థాపకుడు అన్వర్.. ఈ కావేరీ జల వివాదంలో భాగంగా రేగిన ఆందోళనల్లో ఎలా నష్టపోయిందో చెప్పారు. కొందరు గుర్తు తెలియని ఆందోళనకారులు తాము పార్క్ చేసిన స్థలంలోనే వాహనాలకు నిప్పంటించి పరారయ్యారని ఆయన చెప్పారు. కర్ణాటక నుంచి వివిధ ప్రాంతాలకు 1992 సంవత్సరం నుంచి తమ సంస్థ బస్సు సర్వీసులు ఉన్నాయని చెప్పిన ఆయన.. కర్ణాటక నుంచి తమిళనాడు - ఆంధ్రప్రదేశ్ - పుదుచ్చేరి - కేరళకు సుమారు 400 బస్సు సర్వీసులు నడుస్తున్నాయని తెలిపారు.

కాగా.. ఒకటిన్నర నెల క్రితం 52 వోల్వో - స్లీపర్ కోచ్ బస్సులు కొనుగోలు చేశామని చెప్పిన కేపీఎన్ సంస్థ అన్వర్.. బెంగళూరులోని శాంతినగర సమీపంలోని ధ్వారకా నగరలో ఉన్న కంపెనీ గ్యారేజ్ బస్సులు నిలిపి ఉంచామని.. అదే స్థలంలో డ్రైవర్లు - కండెక్టర్ లు విశ్రాంతి తీసుకుంటారని చెప్పారు. అయితే సోమవారం రాత్రి ఈ గ్యారేజీలో పార్క్ చేసిన బస్సులపై ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోలు చల్లి నిప్పంటించారని.. అలా నిప్పటించిన 20 నిమిషాల్లో 36 బస్సులు ఒక్కసారిగా బూడిదయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వీటితోపాటు అత్యాధునిక టెలివిజన్స్ కూడా బూడిదైపోయాయని.. బూడిదైపోయిన ఒక్కోబస్సు రూ. 38 లక్షల నుంచి రూ. 40 లక్షలు ఉంటుందని వివరించారు.

అయితే అప్పటికే ప్రయాణికులంతా డబ్బులు చెల్లించి టిక్కెట్లు బుక్ చేసుకున్నారని, దాంతో ఆ ప్రయాణికులంతా అసౌకర్యానికి గురైనారని - అయినా కూడా వారి టిక్కెట్ డబ్బులు తాము తిరిగి చెల్లిస్తామని అన్వర్ వివరించారు. అయితే ఈ సంఘటనకు సంబందించి పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.