Begin typing your search above and press return to search.
గంటకు 2.45కోట్ల నష్టం.. మోడీ సార్ సాధించిన ఘనత
By: Tupaki Desk | 29 Dec 2019 9:20 AM GMTవివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం.. ఆ తర్వాత జనం ఆందోళన బాటపట్టడం.. కేంద్రంలోని బీజేపీ సర్కారు ఇంటర్నెట్ సేవలను నిలుపుదల చేయడం.. ఇదీ రెండోసారి గద్దెనెక్కాక మన మోడీ సార్ సాధించిన ఘనత.. ఇంటర్నెట్ సేవలను ఆపుచేయడం వల్ల ఆయనకొచ్చే నష్టం ఏమీ లేదు. కానీ దీనివల్ల టెలికాం సంస్థలకు ప్రతీ గంటకు వాటిల్లే నష్టమెంతో తెలుసా? ఇది వింటే మీ గుండె గుభేల్ మనడం ఖాయం.. ఏకంగా భారత మొబైల్ ఆపరేటర్లకు గంటకు 2.45కోట్ల నష్టం వాటిల్లుతోందని భారతీయ మొబైల్ ఆపరేటర్ల సంఘం డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ సంచలన ప్రకటన చేశారు.
ప్రపంచంలోనే అత్యధికంగా ఇంటర్నెట్ ను వాడుతున్న వారుగా భారతీయులు ఉన్నారు. జియో వచ్చాక డిజిటల్ విప్లవం వచ్చింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత అందరూ ఆన్ లైన్ లావాదేవీలు చేస్తున్నారు. బీజేపీ సర్కారు డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించింది. బ్యాంకులు, వ్యాపార, వాణిజ్య, ఉద్యోగాలన్ని ఇంటర్నెట్ తోనే నడుస్తాయి. అలాంటి ఇంటర్నెట్ ను మోడీసార్ వివాదాస్పద నిర్ణయాలతో చెలరేగిన హింసను అరికట్టడానికి బంద్ చేస్తున్నారు.
ఇంటర్నెట్ నిలుపుదలతో టెలికాం సంస్థలకు గంటకు 2.45 కోట్ల నష్టం వాటిల్లితే.. వ్యాపార రంగం నష్టాలను కలుపుకుంటే గంటకు రూ.3.67 కోట్ల నష్టం వస్తుందని భారతీయ మొబైల్ ఆపరేటర్ల సంఘం డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ తెలిపారు. 2018లో మోడీ సర్కారు 134 సార్లు ఇంటర్నెట్ సేవలు ఆపు చేసిందని.. 2019లో ఇప్పటిదాకా మోడీ సర్కారు 104 సార్లు ఇంటర్నెట్ ను దేశంలో ఆపుచేసిందని ఇంటర్నెట్ షట్ డౌన్స్. ఇన్ సంస్థ తెలిపింది.
కశ్మీర్ విభజన ఆర్టికల్ రద్దు నుంచి మొదలు పెడితే.. అయోధ్య వివాదం, పౌరసత్వ సవరణ చట్టం - ఎన్సార్సీ - పార్లమెంట్ చట్టాలతో మోడీ సర్కారు దేశంలో 140 రోజులు ఇంటర్నెట్ ఆపు చేసిందని ఇంటర్నెట్ సంస్థ తెలిపింది. ఇలా మోడీ సార్ దయవల్ల గంటకు అందరికీ కలిపి 3.67 కోట్ల నష్టం వాటిల్లుతుంది.. ఆయన తీసుకున్న అసంబద్ధ నిర్ణయాల వల్ల అందరూ నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని విమర్శిస్తున్నారు.