Begin typing your search above and press return to search.

ఆ 37 మంది కరోనా అనుమానితులదీ శ్రీకాకుళం

By:  Tupaki Desk   |   24 March 2020 3:30 AM GMT
ఆ 37 మంది కరోనా అనుమానితులదీ శ్రీకాకుళం
X
విదేశాల నుంచి వస్తున్న వారిని క్వారంటీన్ కేంద్రాలకు పంపిస్తున్నారు. కానీ, వారిలో కొందరు క్వారంటీన్ పూర్తి కాకుండానే బయటకు వచ్చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఖతార్ నుంచి ముంబయి వచ్చి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుని క్వారంటైన్ ముగియకుండానే ముంబయి నుంచి ప్రైవేటు బస్సులో హైదరాబాదు వస్తూ సంగారెడ్డి జిల్లాలో పట్టుబడిన 37 మందిది శ్రీకాకుళం జిల్లాగా గుర్తించారు.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారంతా జీవనోపాధి కోసం ఖతార్‌ వెళ్లారు. కరోనా భయం ప్రబలుతున్న వేళ ఖతార్ నుంచి వచ్చారు. ఖతార్ నుంచి ఇంటికి వెళ్లిపోదామన్న ఆలోచనతో ప్రైవేటు బస్సు ఎక్కారు. పోలీసులు వారిని పట్టుకుని మళ్లీ గచ్చిబౌలిలోని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. క్వారంటైన్ గడువు ముగిసిన తరువాతే వారిని ఇళ్లకు పంపిస్తామని అధికారులు తెలిపారు. ఆ బస్సులో ప్రయాణించిన వారందరికీ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు.

మరోవైపు దుబాయ్ నుంచి వచ్చిన కాకినాడ మహిళ రైలులో వెళ్తుండగా ఆమె చేతిపై ఉన్న క్వారంటైన్ ముద్ర చూసిన తోటి ప్రయాణికులు అప్రమత్తమైన సికింద్రాబాద్‌ పోలీసులు దించేశారు. ఇక.. నైజీరియా నుంచి ఈ నెల 20న ముంబైకి చేరుకున్న యూపీ వ్యక్తిపై అధికారులు క్వారంటైన్ ముద్ర వేశారు. అతడు యూపీ వెళ్లకుండా ముంబై ఎక్స్‌ప్రెస్‌ లో హైదరాబాద్ చేరుకున్నాడు. అతడ్ని గుర్తించి గాంధీ ఆసుపత్రిలో క్వారంటైన్‌ కు పంపారు. దేశవ్యాప్తంగా ఇలాంటి కేసులు అనేకం బయటపడుతున్నాయి.