Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ ఫ్యామిలీలోకి 38ల‌క్ష‌ల మంది

By:  Tupaki Desk   |   23 Sep 2017 4:19 AM GMT
జ‌గ‌న్ ఫ్యామిలీలోకి 38ల‌క్ష‌ల మంది
X
ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇచ్చిన పిలుపున‌కు అనూహ్య స్పంద‌న ల‌భిస్తోంది. రెండు వారాల‌కు రెండు రోజులు ఉండ‌గా (ఈ రోజును మిన‌హాయిస్తే)నే వైఎస్సార్ కుటుంబంలోకి 38 ల‌క్ష‌ల మంది చేరారు. వైఎస్సార్ కుటుంబంలోకి చేరాల‌న్న పిలుపున‌కు ప్ర‌జ‌ల్లో సానుకూల‌త వ్య‌క్త‌మ‌వుతోంది. ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న స్పంద‌న నేప‌థ్యంలో పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పార్టీ ముఖ్య‌నేత‌ల‌తో స‌మావేశ‌మ‌య్యారు.

వైఎస్సార్ కుటుంబం కార్య‌క్ర‌మం సాగుతున్న తీరును స‌మీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న స్పంద‌న‌పై సంతృప్తి వ్య‌క్తం చేసిన జ‌గ‌న్‌.. ఈ కార్య‌క్ర‌మ‌న్ని మ‌రింత ముందుకు తీసుకెళ్లేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ప్ర‌జ‌ల‌ నుంచి వ‌స్తున్న ఫిర్యాదుల మీద కూడా దృష్టి సారించాల‌న్నారు.

ఏపీలోని 13 జిల్లాల్లో 175 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో క్షేత్ర‌స్థాయి స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని.. ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న ఫిర్యాదుల్ని గమ‌నించి.. అందుకు త‌గ్గ‌ట్లుగా స్పందించాల‌న్నారు.

తాజా కార్య‌క్ర‌మాన్ని పుర‌స్క‌రించుకొని ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న స్పంద‌న‌ను జ‌గ‌న్‌ కు తెలియ‌జేశారు. దివంగ‌త నేత వైఎస్ హ‌యాంలో జ‌రిగిన సంక్షేమ కార్య‌క్ర‌మాలను ప్ర‌స్తావిస్తున్నార‌ని.. ఆరోగ్య శ్రీ‌.. ఫీజులు తిరిగి చెల్లించే ప‌థ‌కాల‌తో పాటు ప‌లు సంక్షేమ కార్య‌క్ర‌మాల్ని ప్ర‌జ‌లు గుర్తు చేసుకుంటున్నార‌న్నారు.

వైఎస్సార్ కుటుంబ కార్య‌క్ర‌మానికి రాష్ట్ర వ్యాప్తంగా వ‌స్తున్న సానుకూల స్పంద‌న నేప‌థ్యంలో.. పార్టీ నేత‌లు.. కార్య‌క‌ర్త‌లు మ‌రింత ఉత్సాహంతో ప‌ని చేసి ఈ కార్య‌క్ర‌మాన్ని మ‌రింతగా విస్త‌రించాల‌న్న ల‌క్ష్యాన్ని నిర్దేశించారు.