Begin typing your search above and press return to search.

సేఫ్ సిటీలో హైదరాబాద్ కు 3వ స్థానం

By:  Tupaki Desk   |   21 Sep 2022 12:30 PM GMT
సేఫ్ సిటీలో హైదరాబాద్ కు 3వ స్థానం
X
దేశంలోనే హైదరాబాద్ కు మరో అరుదైన ఘనత దక్కింది. దేశంలోని అన్ని మెట్రో నగరాల కంటే హైదరాబాద్ సురక్షిత నగరంగా నిలిచింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్.సి.ఆర్.బి) ప్రకారం.. కోల్ కతా , ఫూణే తర్వాత దేశంలోని అత్యంత సురక్షితమైన మెట్రో నగరాల్లో హైదరాబాద్ మూడో స్థానంలో ఉంది.

2014లో తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్రప్రభుత్వం చేపట్టిన వరుస కార్యక్రమాల కారణంగా హైదరాబాద్ సురక్షితమైన నగరంగా కొనసాగుతోంది.

తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే శాంతిభద్రతలు క్షీణిస్తాయని ఆంధ్రప్రదేశ్ కు చెందిన పలువురు మేధావులు, వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత మావోయిస్టులు తమ కార్యకలాపాలను మరింత ఉధృతం చేస్తారని కూడా కొందరు చెప్పారు.

తెలంగాణలో అవినీతికేసులు 2021లో తగ్గుముఖం పట్టాయని ఎన్.సీ.ఆర్.బీ పేర్కొంది. వారి సందేహాలను నివృత్తి చేస్తూ తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ శాంతిభద్రతలు గత ఎనిమిదేళ్లుగా శాంతియుతంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో శాంతిభద్రతలను సమర్థవంతంగా నిర్వహించడంలో పోలీస్ శాఖ విజయం సాధించింది.

2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం శాంతిభద్రతలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి తదనుగుణంగా శాఖకు కొత్త పెట్రోలింగ్ వాహనాలతోపాటు అవసరమైన మౌళిక సదుపాయాలను కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పోలీస్ స్టేషన్ కు తెల్లకాగితాలతో సహా స్టేషనరీ మెటీరియల్ ను కొనుగోలు చేస్తే మొత్తాన్ని కూడా పెంచిందని అధికారులు తెలిపారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.