Begin typing your search above and press return to search.

బాప్ రే.. దేశంలో అన్ని కోట్ల కేసులు పెండింగ్ నా?

By:  Tupaki Desk   |   9 July 2022 12:30 AM GMT
బాప్ రే.. దేశంలో అన్ని కోట్ల కేసులు పెండింగ్ నా?
X
కోర్టు కేసులంటే సంవత్సరాల కొద్దీ నడుస్తూనే ఉంటాయి. కొందరు చనిపోయినా కూడా అవి సా...గుతూనే ఉంటాయి. ఆస్తులు మొత్తం కోర్టు ఖర్చులకు చెల్లించుకున్న వారు కూడా ఉన్నారు. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి కోర్టు కేసులను చాలా మంది ఎదుర్కొంటారు.

గత ఏడాది మార్చి నుంచి ఏప్రిల్ నాటికి కోర్టులలో పెండింగ్ కేసులు 4.4 కోట్లు ఉన్నట్లుగా నివేదికలు చెబుతున్నాయి. కోవిడ్ లాక్ డౌన్, నిబంధనల కారణంగా ఈ కేసుల సంఖ్య 19శాతం పెరిగాయి. ప్రస్తుతం జిల్లా కోర్టులు, సబార్డినేట్ కోర్టులలో 3.9 కోట్ల కేసులు.. వివిధ హైకోర్టులలో 58.5 లక్షల కేసులు.. సుప్రీంకోర్టులో 69 వేలకు పైగా కేసులు పెండింగ్ లో ఉన్నట్టు నేషనల్ జ్యూడిషియల్ డేటా గ్రిడ్, సుప్రీంకోర్టు నివేదికలు చెబుతున్నాయి.

తాజాగా ఎటువంటి కేసులు దాఖలు కాకుంటే దేశంలో ఇప్పుడు కోర్టుల్లో ఉన్న కేసులను పరిష్కరించడానికి 360 సంవత్సరాలు పడుతుందని రాశారు.

దేశవ్యాప్తంగా 25 హైకోర్టులలో 400 జడ్జీల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దిగువ కోర్టులలో 5వేల న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సుప్రీంకోర్టులోనే నాలుగు జడ్జీల పోస్టులు ఖాళీ ఉన్నాయి. వీటితోపాటు దిగువ కోర్టుల్లో సౌకర్యాల కొరత కేసుల ఆలస్యానికి ప్రధాన కారణమవుతోంది.

దేశవ్యాప్తంగా ఉన్న దిగువ కోర్టులలో 4 కోట్లకు పైగా కేసులు పెండింగ్ లో ఉన్నాయని నేషనల్ జ్యూడిషియల్ గ్రిడ్ వెల్లడించిన నివేదిక న్యాయవర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇందులో కోటికి పైగా కేసులు 5 ఏళ్లుగా పెండింగ్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది. అధికంగా ఉత్తరప్రదేశ్ లోనే 1.03 కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయి. తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. తెలంగాణలో 8.5 లక్షలు, ఏపీలో 7.9 లక్షల పెండింగ్ కేసులున్నాయి.

పెండింగ్ కేసుల పరిష్కారానికి బలమైన ప్రత్యామ్మాయ వేదిక ఉండాలనే న్యాయకోవిదుల నుంచి ఎప్పటి నుంచో వినిపిస్తోంది. అమెరికాలో ప్రత్యామ్మాయ వివాద పరిష్కార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా అక్కడి ప్రభుత్వం విప్లవాత్మకమైన చర్యలు తీసుకుంది. ప్రతీకోర్టుకు మదధ్యవర్తిత్వ కేంద్రాలను అనుబంధంగా చేయడం వల్ల చిన్న చిన్న నేరాలకు సంబంధించిన వివాదాలు అక్కడ పరిష్కారమవుతాయని జడ్జీలు అంటున్నారు.