Begin typing your search above and press return to search.
బ్రేకింగ్ : జగన్ ఇలాకాలో వైరస్ కలకలం
By: Tupaki Desk | 4 Jun 2020 12:30 PM GMTఆంధ్ర ప్రదేశ్ లో ఈ మహమ్మారి రోజురోజుకు మరింత విజృంభిస్తోంది. రోజురోజుకి వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతుంది. తాజాగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నివాస సమీపంలో వైరస్ కలకలం రేపింది. జగన్ నివాసానికి అతి చేరువలో ఉన్న ఎన్టీఆర్ కట్ట, క్రిస్టియన్ పేటలో ఈ రోజు నాలుగు వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి అని, ఇందులో ఇద్దరు వాలంటీర్లు కూడా ఉన్నారు అని ప్రసారమాధ్యమాల్లో ప్రచారం అవుతుంది.
దీనితో వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. తాడేపల్లి ప్రాంతం మొత్తం తమ ఆధీనంలోకి తీసుకొని అన్ని రకాల శానిటైజేషన్ పనులను చేస్తున్నారు అని తెలుస్తుంది. కాగా, ఆ ఇద్దరు వాలంటీర్లు ఇద్దరు గత మూడు రెండు క్రితం తాడేపల్లిలో గల ప్రాంతాలలో పింఛన్లు పంపిణీ చేసినట్లు సమాచారం. దీనితో వారు ఎవరెవరిని కాంటాక్ట్ అయ్యారన్న వివరాలను అధికారులు తెలుసుకుంటున్నారని తెలుస్తుంది.
ఇకపోతే ,ఇప్పటివరకు ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3373కు చేరుకోగా.. అందులో 2273 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1033 యాక్టివ్ కేసులు ఉండగా.. మరణించిన వారి సంఖ్య 71కు చేరింది. ఇక విదేశాల నుంచి వచ్చిన వారిలో 119 మందికి వైరస్ నిర్ధారణ కాగా.. నలుగురు కోలుకున్నారు. అలాగే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 616 వైరస్ పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. అందులో ప్రస్తుతం 372 మంది చికిత్స పొందుతున్నారు.