Begin typing your search above and press return to search.
వైసీపీ రంగులకు 4వేల కోట్లా? లెక్కలు అడిగిన హైకోర్టు
By: Tupaki Desk | 17 Feb 2021 5:00 PM ISTఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్ని మారిపోయాయి. చంద్రబాబు అధికారంలో ఉండగా మొత్తం పసుపు రంగు పులిమారు. ప్రభుత్వ ఆఫీసులు.. పథకాలు, అన్నీ టీడీపీ రంగులో ఉండేవి. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి రాగానే ఆ పార్టీ రంగులను పూసేశారు.
అయితే తాజాగా ఏపీ ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్న అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. డాక్టర్ శైలజ అనే ఆమె ప్రజాధనాన్ని వైసీపీ నుంచి మంత్రుల నుంచి రికవరీ చేయాలని పిటీషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడానికి నాలుగు వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని డాక్టర్ శైలజ పిటీషన్ వేశారు. వారి నుంచి వసూలు చేయాలని కోరారు.
ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగుల విషయంలో దాఖలు చేసిన పిటిషన్‌పై పిటిషనర్ తరఫున అడ్వకేట్ డీఎస్ ఎన్ వి ప్రసాద్ బాబు వాదనలు వినిపించారు. ఈ కేసులో కోర్టు తీర్పు వచ్చే వరకు మాజీ సీఎస్ నీలం సాహ్ని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆపాలని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, మంత్రుల నుండి బ్యాంకు గ్యారెంటీ తీసుకోవాలని పిటిషనర్ కోరారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కోర్టు.. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భవనాలకు రంగులు వేయటం పెద్ద వివాదానికి కారణం అయ్యింది. అయితే ఆ రంగులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాలోని రంగులు అంటూ ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని పంచాయతీ కార్యాలయాలకు వేసిన వైసీపీ రంగులను తొలగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులను వేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై పంచాయతీ కార్యాలయాలు ప్రభుత్వానివని, వాటికి పార్టీ రంగులు ఉండకూడదని హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. తాజాగా మరోసారి విచారణలో హైకోర్టు కీలక సూచనలు చేసింది. 4వేల కోట్ల ఖర్చు లెక్కలను ప్రభుత్వాన్ని హైకోర్టు అడిగింది.