Begin typing your search above and press return to search.
ఒకటి కాదు..నాలుగు..కరోనా స్ట్రెయిన్లున్నాయ్! డబ్ల్యూహెచ్ వో క్లారిటీ..!
By: Tupaki Desk | 3 Jan 2021 8:26 AM GMTఇటీవల కరోనా కొత్త స్ట్రెయిన్ ప్రపంచదేశాలను వణికిస్తున్నది. ఇప్పటికే ఈ కొత్త స్ట్రెయిన్ కేసులు బ్రిటన్ లో వేలల్లో నమోదయ్యాయి. మనదేశంలోనూ కొత్త స్ట్రెయిన్ కేసులు వస్తున్నాయి. కొత్త స్ట్రెయిన్ పై ప్రపంచదేశాలన్నీ అలర్టయ్యాయి. ఏ వైరస్ అయినా కొంతకాలానికి రూపాంతరం చెందుతుంది. అదే కొత్త స్ట్రెయిన్. కరోనా వైరస్ కూడా జన్యుమార్పిడి చెందింది. అయితే కొత్త స్ట్రెయిన్ కూడా పాత కరోనా లక్షణాలే ఉన్నాయి. కానీ కొత్త స్ట్రెయిన్ 70 శాతం ఎక్కువగా వ్యాప్తి చెందుతోందని.. మరణాల రేటు కూడా ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఈ కొత్త స్ట్రెయిన్ పై డబ్ల్యూహెచ్ వో ( ప్రపంచ ఆరోగ్యసంస్థ) స్పందించింది.
అయితే కరోనా వైరస్ తొలి కేసు నమోదైనప్పటి నుంచి నేటివరకు మొత్తం నాలుగు రకాల కొత్త స్ట్రెయిన్లు వెలుగులోకి వచ్చినట్టు డబ్ల్యూహెచ్వో తాజాగా పేర్కొన్నది. చైనాలో గత ఏడాది జనవరిలో డీ614జీ అనే కొత్త స్ట్రెయిన్ పుట్టిందని డబ్ల్యూహెచ్ వో పేర్కొన్నది. ఆ తర్వాత ఈ స్ట్రెయిన్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిందని ప్రపంచ ఆరోగ్యసంస్థ చెప్పింది. ఆగస్టు - సెప్టెంబర్ నెలల్లో డెన్మార్క్ లో క్లస్టర్-5 అనే మూడో స్ట్రయిన్ గా పుట్టుకొచ్చిందని డబ్ల్యూహెచ్ వో చెప్పింది. ఈ ఏడాది డిసెంబర్ నెలలో బ్రిటన్ లో మరో కరోనా స్ట్రెయిన్ ఉనికిలోకి వచ్చింది. అయితే ఈ కొత్త స్ట్రెయిన్ కు పాత కరోనా వైరస్ కు చాలా వ్యత్యాసం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు.
దానికి తోడు ఈ వైరస్ వ్యాప్తి కూడా ఎక్కువగా ఉన్నదని వైద్యులు అంటున్నారు. అయితే ఈ వైరస్ దక్షిణాఫ్రికా నుంచి బ్రిటన్ కు వచ్చిందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు భారత్ లోనూ ఈ తరహా కొత్త స్ట్రెయిన్ విజృంభిస్తున్నది. అయితే వేల సంఖ్యలో టెస్టులు చేస్తేనే ఈ కొత్త స్ట్రెయిన్ బయటపడే అవకాశం ఉన్నది. కరోనా అనేది ఆర్ ఎన్ ఏ వైరస్ అందువల్ల ఈ వైరస్ రూపాంతరం చెందడం సహజమేనని శాస్త్రవేత్తలు అంటున్నారు.