Begin typing your search above and press return to search.

క్యాన్సర్ జయించిన నాలుగేళ్ల చిన్నారికి కరోనా.. తర్వాతేమైందంటే?

By:  Tupaki Desk   |   28 April 2020 5:30 AM GMT
క్యాన్సర్ జయించిన నాలుగేళ్ల చిన్నారికి కరోనా.. తర్వాతేమైందంటే?
X
ప్రపంచమే వణికిపోతున్న కరోనా వైరస్ కు అంతుచిక్కనిదిగా మారింది బుజ్జితల్లి శివాని ఉదంతం. నాలుగేళ్ల ఈ బుజ్జాయి ఉదంతం వింటే.. కరోనా పాజిటివ్ గా తేలిన వారు ఏ మాత్రం భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదన్న విషయాన్ని స్పష్టం చేస్తుంది. భారత్ కు చెందిన నాలుగేళ్ల చిన్నారి దుబాయ్ లో ఉంటోంది.ఈ చిన్నారి ఉదంతం ఆద్యంతం ఆసక్తికరంగానే కాదు.. ఊహించని ట్విస్టులెన్నో కనిపిస్తాయి.

నాలుగేళ్ల చిన్నారి శివానీ ఇప్పటికే క్యాన్సర్ ను జయించింది. క్యాన్సర్ వ్యాధి కారణంగా ఆమెలోని రోగనిరోధక శక్తి చాలా తక్కువ. ఇలాంటివేళలోనే ఆమె తల్లికి.. ఆమెకు కరోనాపాజిటివ్ గా తేలింది. తండ్రికి మాత్రం నెగిటివ్ ఫలితం వచ్చింది. ఏప్రిల్ ఒకటిన వైరస్ లక్షణాలతో దుబాయ్ లోని అల్ ఫతేమ్ హెల్త్ హబ్ ఆసుపత్రిలో చేరిన ఆమె.. ఈ నెల 20న మాయదారి వైరస్ నుంచి క్షేమంగా బయటపడింది. ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉంటోంది.

శివాని తల్లి దుబాయ్ లో ఆరోగ్య కార్యకర్తగా జాబ్ చేస్తుంటారు. అలా ఆమె కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో ఆమె ఇంట్లో పరీక్షలు నిర్వహించగా.. శివానీ తండ్రికి నెగిటివ్ రిజల్ట్ రాగా.. చిన్నారికి మాత్రం వైరస్ సోకినట్లు గుర్తించారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. శివాని చిన్నతనంలోనే క్యాన్సర్ బారిన పడటంతో.. దుబాయ్ వైద్యులు ఆమె విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. చిన్న వయసులోనే కిడ్నీక్యాన్సర్ బారిన పడిన ఆమె.. తాజాగా కరోనాను జయించటం పట్ల వైద్యులు సైతం సంతోషానికి గురి అవుతున్నారు. అందరిని వణికించే కరోనా.. నాలుగేళ్ల చిన్నారి శివాని విషయంలో మాత్రం తోక ముడిచిందని పేర్కొంటున్నారు.