Begin typing your search above and press return to search.

ప‌ళ‌ని ప్ర‌భుత్వానికి షాకేనా?

By:  Tupaki Desk   |   28 Aug 2017 9:58 AM GMT
ప‌ళ‌ని ప్ర‌భుత్వానికి షాకేనా?
X
త‌మిళ‌నాడులో వ‌ర్టీ స‌మీక‌ర‌ణలు మారిపోతున్నాయి. అధికారంలో ఉన్న ప‌ళ‌ని వ‌ర్గంలోని ఎమ్మెల్యేల క‌ప్ప‌దాట్లు అంద‌రినీ విస్తుగొలుపుతున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఈపీఎస్‌ - ఓపీఎస్ వ‌ర్గాలు క‌లిస్తే.. రాష్ట్రంలో సుస్థిర ప్ర‌భుత్వం పాల‌న సాగుతుంద‌ని ఆశించిన వారికి ఇప్పుడు జ‌రుగుతున్న క‌ప్ప‌ల త‌క్కెడ వ్య‌వ‌హారాలు చిరాకు పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా అన్నాడీఎంకే శ‌శిక‌ళ వ‌ర్గం నేత దిన‌క‌ర‌న్.. ఈసీ కేసుపై జైలుకు వెళ్లి త‌ర్వాత బ‌య‌ట‌కు వ‌చ్చినప్ప‌టి నుంచి ప‌రిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. ప‌ళ‌ని బ‌లాన్ని చెద‌ర‌గొట్టి.. త‌న‌కు అనుకూలంగా రాష్ట్ర రాజ‌కీయాల‌ను మార్చుకునేందుకు దిన‌క‌ర‌న్ వ్యూహం ర‌చించి అమ‌లు చేస్తుండ‌డంతో ప‌ళ‌ని ప్ర‌భుత్వం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడుతుందో కూడా చెప్ప‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది.

విష‌యంలోకి వెళ్తే.. శశికళ మరియు ఆమె వర్గీయులపై వేటు వేయటమే ల‌క్ష్యంగా సీఎం ప‌ళ‌నిస్వామి రొయపెట్టాలో సోమవారం నిర్వహించిన‌ కీలక సమావేశానికి 40 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. దీంతో పళని - పన్నీర్‌ లలో కొత్త టెన్షన్‌ మొదలైంది. కాగా, రొయపెట్టాలో జరిగే పార్టీ సర్వ సభ్య సమావేశానికి తమకు ఆహ్వానం అందలేదని, తామంతా దినకరన్‌ వెంటే నడుస్తామని ఎమ్మెల్యే తంగ తమిళసెల్వన్‌ స్పష్టం చేశారు. పళని-పన్నీర్‌ వర్గంలో మరింత మంది స్లీపర్‌ సెల్స్ ఉన్నారని - వారంతా త్వరలో దినకరన్‌ గూటికి చేరతారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

గవర్నర్‌ పారదర్శకంగా వ్యవహరించి అసెంబ్లీలో బలనిరూపణ నిర్వహిస్తారని ఆశిస్తున్నామని, అలాకానీ పక్షంలో రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని కోరే అవ‌కాశం ఉంద‌ని కూడా సెల్వ‌న్ చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఇక పళని స్వామి వ‌ర్గానికి చెందిన విద్యుత్‌ శాఖ మంత్రి పి తంగమణిని నమక్కల్‌ జిల్లా సెక్రటరీ పదవి నుంచి తొలగిస్తూ దిన‌క‌ర‌న్ త‌న దూకుడు పెంచారు. ఆ స్థానంలో త‌న అనుచ‌రుడు అనబఝన్‌ను నియమించారు.

ఇదిలావుంటే, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రతిపక్ష డీఎంకే పార్టీతో టీవీవీ దినకరన్ చేతులు కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందని బీజేపీ నేత సుబ్రమణియన్‌ స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో మ‌రోసారి త‌మిళ‌నాడులో రాజ‌కీయాలు ర‌స‌కందాయంలో ప‌డ్డాయి. ప్ర‌స్తుతం దీనికి ఎలా ఫుల్ స్టాప్ పెడ‌తారు? అనే విష‌యం గ‌వ‌ర్న‌ర్ కోర్టులో ఉండ‌డం గ‌మ‌నార్హం. ఆయ‌న నిర్ణ‌యం కోసం అంద‌రూ వేయి క‌ళ్లతో ఎదురు చూస్తున్నారు.