Begin typing your search above and press return to search.

ఏపీలో 40 మంది పిల్లలకు కరోనా .. అందరూ తబ్లిగీల పిల్లలే !

By:  Tupaki Desk   |   17 April 2020 5:30 AM GMT
ఏపీలో 40 మంది పిల్లలకు కరోనా .. అందరూ తబ్లిగీల పిల్లలే !
X
ఏపీలో కరోనా మహమ్మారి రోజురోజుకి మరింతగా విజృంభిస్తుంది. రాష్ట్రంలో కరోనా మరింత వేగంగా విజృంభించకుండా ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా కూడా రోజురోజుకి కరోనా భాదితుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 534 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. వారిలో మూడేళ్ల నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న 40 మంది పిల్లలు కరోనా వైరస్ బారిన పడ్డారు. మార్చి నెలలో నిజాముద్దీన్ మర్కజ్‌కు వెళ్లొచ్చిన కుటుంబ సభ్యుల ద్వారా వీరికి కరోనా సోకింది.

తల్లిదండ్రుల నిర్లక్ష్యం కారణంగానే చిన్నారులకు కరోనా సోకింది. ప్రభుత్వాలు ఎంత చెప్పినా వినకుండా ఇళ్లలోనే ఉండిపోయి కుటుంబంలోని వారికి కరోనాను అంటించారు. 40 మంది పిల్లలతోపాటు తబ్లీగీకి వెళ్లొచ్చిన వారి ద్వారా 124 మంది మహిళలకు కూడా కోవిడ్ పాజిటివ్ అని తేలింది. జమాత్‌ కు వెళ్లొచ్చిన ఒక్కో వ్యక్తి తనకు తెలియకుండానే.. చాలా మంది కుటుంబ సభ్యులకు ఈ వైరస్‌ను అంటించారు. లాక్‌డౌన్ ఆరంభంలో తబ్లీగీ జమాత్ ఉదంతం వెలుగు చూడగా.. మర్కజ్‌ కు వెళ్లొచ్చిన వందలాది మందికి కరోనా పాజిటివ్ అని తేలిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో జరిగిన ఈ మత సంబంధ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో హాజరయ్యారు.

రాష్ట్రంలో కరోనా కేసుల్లో గుంటూరు జిల్లా 122 కేసులతో టాప్‌ లో ఉంది. మొత్తం 13 జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు 11 జిల్లాల్లో నమోదుకాగా.. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. నమోదైన కేసుల్లో ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారు ఎక్కువమంది ఉండటం గమనార్హం. మరోవైపు తెలంగాణలో 25 మంది పిల్లలకు కరోనా పాజిటివ్ అని తేలింది. వీరంతా హైదరాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో కొత్తగా 50 కరోనా కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 700కు చేరింది.