Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ కు 400 సీట్లా ? ..జరిగేదేనా ?
By: Tupaki Desk | 17 April 2022 7:25 AM GMTరాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) కాంగ్రెస్ పార్టీలో పెద్ద జోక్ చేస్తున్నారు. సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంక తదితరులతో పీకే భేటీ అయ్యారు. ఈ భేటీలో రాబోయే ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ అనుసరించాల్సిన రోడ్ మ్యాప్ ప్రజెంటేషన్ ఇచ్చారట. ఇందులో 400 సీట్లపై టార్గెట్ చేయాలని చెప్పారట. పీకే మాట విన్న తర్వాత సోనియా సంగతేమో కానీ మిగిలిన వాళ్ళకు నవ్వాగుండదు. కాంగ్రెస్ ఏమిటి 400 సీట్లపై గురిపెట్టడమేంటి ?
మొన్ననే జరిగిన ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల్లో పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. ఒకవైపు ప్రియాంక మరోవైపు రాహుల్ ఎంత ప్రచారం చేసినా ఒక్క రాష్ట్రంలో కూడా గెలవలేదు. ఇది రాహుల్, ప్రియాంక స్టామినా. ఇక సోనియా అంటారా తీవ్రమైన అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నందన బయటకు ప్రచారం చేసేంత సీన్ పెద్దగా లేదు. అందుకనే పిల్లలిద్దరు నానా అవస్థలు పడుతున్నారు.
ఇక్కడ విచిత్రమేమిటంటే పార్టీ మీద క్యాడర్ కు జనాలకు అభిమానం బాగానే ఉంది. కానీ రాహుల్ కే పార్టీ మీద ప్రేమలేనట్లుంది. ఎందుకంటే ఇప్పటికీ రాహుల్ రాజకీయాలను సీరియస్ గా తీసుకోవటంలేదు. మోడీకి తానే సరైన ప్రత్యామ్నాయమని జనాలను రాహుల్ మెప్పించలేకపోవటమే బీజేపీ అదృష్టం. అందుకనే రాహుల్ పదికాలాలపాటు కాంగ్రెస్ అగ్రనేతగా ఉండాలని కమలనాథులు కోరుకుంటున్నది.
జనాలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయాలని అనుకుంటున్నా రాహుల్ వైఖరి వల్ల ఏమేస్తాంలే అని చివరకు ఇతర పార్టీలకు ఓట్లు వేస్తున్నట్లున్నారు. రాహుల్ అంటే పార్టీ నేతలకే కాదు చివరకు జనాలకు కూడా బాగా చీపైపోయారు. ఇలాంటి పరిస్ధితులు వచ్చే ఎన్నికల్లో 400 సీట్ల టార్గెట్ అంటే జోక్ కాక మరేమవుతుంది.
ఇపుడు కాంగ్రెస్ ఖాతాలో ఉన్నది 56 సీట్లు మాత్రమే. అంటే 56 నుండి 400కి పెరగాలంటే మామూలు విషయమా ? జనాలే మోడీ అంటే మండిపోయి వేరేదారిలేక కాంగ్రెస్ కు ఓట్లేసేసినా మహా అయితే 100-150కి పెరుగుతుందేమో కానీ 400 మాత్రం సాధ్యం కాదు. సరే పీకే చెప్పింది 400 టార్గెట్ గా పెట్టుకోమనే కదా తప్పులేదు చూద్దాం ఏమవుతుందో.