Begin typing your search above and press return to search.
మీరీ వార్తను.. నమ్మరంటే నమ్మరంతే
By: Tupaki Desk | 12 Oct 2016 10:30 PM GMTమేం చెప్పినా మీరు నమ్మలేనంత వార్త ఏమిటి? అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం. వార్త చెప్పేముందు మళ్లీ మీకు చెబుతున్నాం. మేం చెప్పే విషయాన్ని మీరు ఒక పట్టాన నమ్మరంటే నమ్మరని చెప్పొచ్చు. ఎందుకంటారా? మేం చెప్పబోయే విషయం అలాంటిది మరీ. ఇక.. నేరుగా పాయింట్ లోకి వెళ్లిపోతే.. రైళ్ల గురించి జోకులేయని ఇండియన్లు దాదాపుగా ఉండరేమో. భారత రైల్వేలు.. దాని వేగం.. గమ్యస్థానానికి చేరుకునే విషయంలో జరిగే ఆలస్యంపై తిట్టేయటం అందరికి అలవాటైన విషయం.
కానీ.. షాకింగ్ నిజం ఏమిటంటే.. దేశంలోని రైళ్లల్లో 400 రైళ్లు.. గమ్యస్థానానికి తాము చేరుకోవాల్సిన సమయం కంటే దాదాపు 5 నిమిషాల నుంచి 25 నిమిషాలు ముందే వెళ్లిపోతున్నాయంట. లేట్ కి లేటెస్ట్ వెర్షన్ లాంటి రైలుబండి.. చేరుకోవాల్సిన టైం కంటే ముందే చేరుకోవటమా? అన్నది నమ్మక పోవచ్చు. కానీ.. అది నిజమన్న విషయాన్ని రైల్వే శాఖ తాజాగా స్పష్టం చేస్తోంది.
అదెలా సాధ్యమంటే.. దానికి సమంజసమైన కారణం లేకపోలేదు. రైళ్లల్లో అనుసరిస్తున్న సమయపాలన.. సిగ్నలింగ్ వ్యవస్థ మెరుగుపర్చటం.. రద్దీగా ఉన్న ప్రాంతాల్లో అదనపు లైన్లను ఏర్పాటు చేయటం లాంటి చర్యలు తీసుకోవటంతో..గమ్యస్థానానికి చేరుకోవాల్సిన రైళ్లు తాము చేరుకోవాల్సిన సమయానికి కంటే ముందుగా చేరుకుంటున్నాయి. అలా అని ఇలా ముందుగా చేరుకుంటున్న ట్రైన్లు అన్నీ సూపర్ ఫాస్ట్ ట్రైన్లు అనుకుంటే తప్పులో కాలేసినట్లే.
గమ్యస్థానానికి ముందుగా చేరుకుంటున్న ట్రైన్లలో 350 మెయిల్.. ఎక్స్ ప్రెస్ రైళ్లతో పాటు.. 74 రాజధాని.. శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైళ్లు ఉన్నాయి. ఇక.. ముందుగా తరుచూ వెళుతున్న రైళ్ల విషయానికి వస్తే.. హౌరా.. పాట్నా రాజధాని రైళ్లతో పాటు.. చెన్నై – కోయంబత్తూర్.. హౌరా – పూరీ ఎక్స్ ప్రెస్ రైళ్లతో పాటు మరిన్ని ట్రైన్లు ఉన్నాయని చెబుతున్నారు. ఇంటర్ లాకింగ్ వ్యవస్థ కారణంగా కూడా ఏ ఫ్లాట్ ఫాం ఖాళీగా ఉంటే ఆ ఫ్లాట్ ఫాం మీదకు రైలు వచ్చే ఏర్పాటు కూడా రైళ్లు గమ్యస్థానానికి అనుకున్న దాని కంటే ముందు వచ్చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఏది ఏమైనా.. రైళ్లకు సంబంధించినంత వరకూ ఇదో కొత్త విషయంగా చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/