Begin typing your search above and press return to search.
4వేల కోట్ల స్కామ్ కేసు.. ఐఏఎస్ ఆత్మహత్య
By: Tupaki Desk | 24 Jun 2020 10:10 AM GMTకర్ణాటకలో 2019 లో సంచలనం సృష్టించిన ఐఎంఏ కుంభకోణంలో చిక్కుకున్న ఐఏఎస్ అధికారి విజయ్ శంకర్ మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు.బెంగళూరులోని ఆయన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. విజయ్ శంకర్ రూ.1.5 కోట్ల లంచం తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. అయితే, తాజా విచారణలోనూ ఆయన పేరు తెరపైకి వచ్చింది. గతంలో బెంగుళూరు సిటీ కలెక్టర్ గా పని చేసిన విజయ్ శంకర్ మంగళవారం సాయంత్రం తిలక్ నగర్ పోలీసులు స్టేషన్ పరిధిలోని తన నివాసంలో ప్రాణాలు తీసుకున్నారు.
ఈ ఘటన జరిగినప్పుడు విజయశంకర్ బార్య, కూతురు ఇంట్లోనే ఉన్నారు.. సాయంత్రం వరకు ఇంట్లోవారితో గడిపి ఆయన.. ఆ తర్వాత ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న తన మీటింగ్ రూమ్ కి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. విజయ్ శంకర్ ఆత్మహత్యకు ముఖ్య కారణం. ఐఐఎం కేసులో ఆయన లంచం తీసుకున్నట్లు ఆరోపణలు రావడమేనని స్పష్టంగా తెలుస్తోంది.
కాగా, కర్ణాటకలో 2019లో ఐఎంఏ స్కాంలో సంచలనం సృష్టించింది.. ఈ స్కామ్ లో ప్రధాన నిందితుడైన మన్సూర్ ఖాన్ నుంచి కోటిన్నర లంచం తీసుకుని అతనికి క్లీన్ చీట్ ఇచ్చారనేది విజయ్ శంకర్ పై సీబీఐ చేసిన ప్రధాన అభియోగం. ఈ కేసులో విజయ్ శంకర్ తో పాటు మరో ఇద్దరిని విచారించేందుకు రెండు వారాల క్రితం కర్ణాటక ప్రభుత్వం సీబీఐకి అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో విజయ్ శంకర్ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.భారీ వడ్డీలు చెల్లిస్తామని ఆశ చూపి కర్ణాటకలో రూ.4 వేల కోట్లకు పైగా డిపాజిట్ల రూపంలో సేకరించి ఐఎంఏ జ్యూవెలర్స్ బోర్డు తిప్పేసింది. దాదాపు 50 వేల మంది డిపాజిటర్లు ఈ సంస్థపై, సంస్థ యజమాని మన్సూర్ పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అప్పట్లో ఈ కేసు సంచలనానికి దారి తీసింది.