Begin typing your search above and press return to search.
అగ్నిప్రమాదంతో బీచ్ లో చిక్కుకుపోయిన వేలాది మంది
By: Tupaki Desk | 1 Jan 2020 4:48 AM GMTదూరపు కొండలు నునువు అన్న సామెత ఉత్తనే రాలేదేమో. తాజా ఉదంతాన్ని చూస్తే.. అల్లంత దూరాన అండే ఆస్ట్రేలియా లాంటి దేశంలో ఉంటే జీవితానికి అంతకంటే ఏం కావాలన్న ఆలోచన చాలామంది చేస్తారు. మనం ఉన్న చోట ఉన్న సుఖం.. అయినోళ్లకు దగ్గరగా ఉన్నప్పుడు ఉండే సంతోషం సదూర తీరాలకు వెళితే ఏముండదన్నది అక్కడికి వెళ్లాక కానీ తెలీదు. అన్నింటికి మించి మన దగ్గర ఎప్పుడూ ఎదురుకాని సిత్రమైన కష్టాలు ఆయా దేశాల్లో ఎదురవుతుంటాయి. తాజాగా చోటు చేసుకున్న అగ్నిప్రమాదంతో అక్కడి ప్రజల అవస్థలు చూస్తే అయ్యో అనుకోవాల్సిందే.
ఇటీవల కాలంలో ఆగ్నేయ ఆస్ట్రేలియాలో అడవులు అంటుకోవటం.. వేలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తాజాగా మల్లకూట పట్టణానికి సమీపంలోని అడవులకు మంటలు అంటుకున్నాయి. అంతకంతకూ పెరిగిపోతున్న మంటల తీవ్రతతో అక్కడి ప్రజలకు ఏం చేయాలో తోచలేదు. మంటలకు తోడుగా దట్టమైన పొగ అలుముకోవటంతో వీధుల్లో ఉండటం ఏ మాత్రం సురక్షితం కాదని అర్థం చేసుకొని.. సమీపంలోని బీచ్ లోకి పరుగులు తీశారు.
దీంతో బయటకు వస్తే మంటలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ.. బీచ్ లో చిక్కుకుపోయారు. స్థానికుల సంగతి ఇలా ఉంటే.. బీచ్ లో ఎంజాయ్ చేద్దామని వచ్చిన పర్యాటకులు.. ఊహించని పరిణామానికి ఉక్కిరిబిక్కిరి అయ్యారు. బయటకు రావటానికి వీల్లేని పరిస్థితులు చోటు చేసుకోవటంతో వారు అక్కడు చిక్కకుపోయారు. ఇప్పుడా బీచ్ లో దాదాపు నాలుగు వేల మంది వరకూ ఉన్నట్లు తెలుస్తోంది.
గత కొద్ది రోజులుగా మంటల కారణంగా ఆస్ట్రేలియాలోని పలు ప్రాంతాలకు చెందిన వారు ఇబ్బందులకు గురి అవుతున్ానరు. తాజాగా చూస్తే న్యూ సౌత్ వేల్స్.. విక్టోరియా రాష్ట్రాలకు మంటలు వ్యాపించాయి. ఎక్కువ జనాభా ఉండే బాల్ మాన్స్ బే పట్టణానికి మంటలు చేరాయి. మంటల వేళ పరిస్థితి భీతావాహంగా మారింది. విమానాలతో నిఘా వేస్తున్నారు. భారీ ఎత్తున ఎగిసి పడుతున్న మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు స్థానిక యంత్రాంగం కిందామీదా పడుతోంది. ఇదంతా చదివినప్పుడు మనం ఉండే ప్రాంతాల్లో ఇలాంటి విపరీతాలు ఉండవనిపించక మానదు.