Begin typing your search above and press return to search.
ఆ 4 వేలమంది క్వారంటైన్ పూర్తయ్యాకే ఇళ్లకు..ఎవరంటే!
By: Tupaki Desk | 30 April 2020 8:30 AM GMTలాక్ డౌన్ కారణంగా చాలామంది తమకి సంబంధం లేని , చాలామంది ఇతర ప్రాంతాలలో చిక్కుకుపోయారు. వీరందరూ కూడా లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారా ..ఎప్పుడు ఇంటికి వెళ్దామా అని ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో గుజరాత్ లో చిక్కుకుపోయిన ఏపీ మత్స్యకారుల భాదను అర్థం చేసుకున్న ఏపీ ప్రభుత్వం ..కేంద్రం , గుజరాత్ ప్రభుత్వాలతో మాట్లాడి వారికీ బస్సులలో ఇక్కడి తీసుకువచ్చే ఏర్పాట్లు చేసింది. వారందరు కూడా గురువారం సాయంత్రానికి సొంత జిల్లాలకు చేరుతారని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ వెల్లడించారు.
ఈ మేరకు బుధవారం మంత్రి మోపిదేవి మీడియాతో మాట్లాడుతూ.. వివిధ జిల్లాలకు చెందిన దాదాపు 4 వేల మంది మత్స్యకారులు 65 బస్సుల్లో మంగళవారం రాత్రి గుజరాత్ నుంచి బయల్దేరినట్లు తెలిపారు. వీరిలో 2,852 మంది శ్రీకాకుళం జిల్లా నుంచి ఉండగా, మిగిలిన వారంతా విజయనగరం - విశాఖపట్నం - ఉభయగోదావరి జిల్లాలు - కృష్ణా జిల్లాల వారున్నారని మంత్రి వివరించారు.
అక్కడి నుండి వచ్చిన వారందరిని ముందుగా క్వారంటైన్ కేంద్రాలకు తరలించి వైద్య పరీక్షల అనంతరం కరోనా లక్షణాలు లేవని నిర్ధారించుకున్నాకే స్వస్థలాలకు పంపుతామని మంత్రి మోపిదేవి వెంకటరమణ స్పష్టం చేశారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. మత్స్యకారుల కుటుంబ సభ్యులు ఎవరూ ఆందోళన చెందొద్దని, వారందరినీ ప్రభుత్వమే సొంత గ్రామాలను తీసుకొస్తుందని భరోసా ఇచ్చారు. వారిని సొంత గ్రామాలను చేర్చేందుకు ప్రభుత్వమే అన్ని ఖర్చులు భరిస్తుందని స్పష్టం చేశారు. దీని కోసం సీఎం జగన్ ఇప్పటికే రూ. 3 కోట్లు విడుదల చేశారని గుర్తు చేశారు.