Begin typing your search above and press return to search.
గిన్నిస్ లోకి దుబాయ్ పోలీసుల కార్లు
By: Tupaki Desk | 27 March 2017 2:03 PM GMTదుబాయ్ పేరు విన్నంతనే ఆకాశాన్ని తాకేలా కనిపించే భారీ ఎత్తున ఉండే భవనాలు.. విలాసవంతమైన అరబ్బు షేకుల ముచ్చట్లు చాలానే వినిపిస్తుంటాయి. తాజాగా అంతకు మించి అన్న రీతిలో కొత్త విషయం ఒకటి బయటకు వచ్చింది. ఆ దేశంలో పోలీసులకు ఇచ్చే కార్ల ముచ్చట ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రపంచానికి పెద్దన్న అయిన అమెరికా సైతం తన పోలీసులకు దుబాయ్ షేకులిచ్చినంత ఆధునాతనమైన.. వేగవంతమైన కార్లను ఇవ్వలేరేమో. పోలీసుల కార్లు అన్న వెంటనే.. ముక్కి మూలుగుతూ.. దశాబ్దాలుగా అదే పనిగా వాడి పారేసిన కార్లు మన కళ్ల ముందు సాక్ష్యాత్కరిస్తాయి.
ఏదో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఫుణ్యమా అని.. ఇన్నోవా కార్లను చూస్తున్నాం..కానీ..గతంలో పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. మనోళ్ల ఇన్నోవా కార్ల షోకుచూసుకునే తెగ మురిసిపోతాం. కానీ.. దుబాయోడి సోకు చూస్తే.. షాకే మరి.అరబ్ షేక్ స్థాయిలోనే.. వారి పోలీసులకు ఇచ్చే కార్లు ఉంటాయన్న విషయం తాజాగా బయటకు వచ్చింది.
దుబాయ్ లో పోలీసుల కార్ల ఎంత స్పీడ్ అంటే..జస్ట్ గంటకు 407 కిలోమీటర్ల ఫాస్ట్ తో దూసుకెళ్లిపోతాయట. జస్ట్ రెండు సెకన్ల వ్యవధిలోనే సున్నా నుంచి 97 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే సత్తా ఉన్న కార్ల ముచ్చట ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. దీనికి కారణం లేక పోలేదు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తే పోలీసు కారుగా దీన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వారు గుర్తించారు మరి.
మరింత వేగంగా దూసుకెళ్లే కారు ఖర్చు కూడా ఓ రేంజ్ లోనే ఉంటుంది మరి. ఒక అంచనా ప్రకారం.. ఈ స్పీడ్ స్టర్ కారు ఒక్కొక్కటి రూ.10.5 కోట్ల వరకూ ఉండొచ్చన్న వాదన వినిపిస్తోంది. 16 సిలిండర్లు ఉండే కారు ఇంజిన్ వెయ్యి హార్స్ పవర్ ను ఉత్పత్తి చేస్తుందని చెబుతున్నారు. దుబాయ్ పోలీసులు ఖరీదైన కార్లు వాడుతున్నా..అత్యంత విలువైన కారు మాత్రం తాజాగా గుర్తించిందేనని చెబుతున్నారు. మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే..ఏదైనా కేసుల్ని పరిష్కరించటానికి వినియోగించాల్సిన ఈ కారును.. పర్యాటకుల నుంచి దేశీయుల వరకూ విపరీతమైన మక్కువ ప్రదర్శిస్తున్నారట. ఈ కారు వద్దకు వచ్చి సెల్ఫీలు దిగటం.. ఫోన్ చేసి..కారు ముచ్చట్లను పోలీసులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారట. ఒక లెక్క ప్రకారం దుబాయ్ పోలీసుల దగ్గర 14 సూపర్ ఫాస్ట్ కార్లు ఉన్నాయట. ఆ కార్ల చిట్టా చూస్తే..
1. మెక్ లారెన్ ఎంపీ4-12
2. లాంబోర్గిని అవెంటడార్
3. ఫెరారి ఎఫ్ఎఫ్
4. మెర్సిడెస్ ఎస్ఎల్ఎలస్ ఏంఎజీ
5. రౌష్ మస్టాంగ్
6. బెన్నెట్లీ కాంటినెంటల్ జీటీ
7. ఆడి ఆర్8వి01
8. ఆడి ఆర్8వి01 ప్లస్
9. నిస్సాన్ జీటీఆర్
10. మెర్సిడెస్ ఎస్ఎల్36 ఏఎంజీ
11. ఆస్టన్ మార్టిన్ వన్-77
12. హైబ్రిడ్ పోర్షే పనామెరా
13. బీఎండబ్ల్యూ గ్రాన్ క్రూప్
14. మెర్సిడెస్ జి36 ఏఎంజి (లిమిటెడ్ ఎడిషన్)
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/