Begin typing your search above and press return to search.

అమెరికా అల్లకల్లోలం నిండా మునిగిన న్యూయార్క్, న్యూజెర్సీ

By:  Tupaki Desk   |   3 Sep 2021 4:39 AM GMT
అమెరికా అల్లకల్లోలం నిండా మునిగిన న్యూయార్క్, న్యూజెర్సీ
X
అగ్రరాజ్యం అమెరికా ఇడా హరికేన్ తుఫాన్ ధాటికి చిగురుటాకుల వణుకుతోంది. అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ అతలాకుతలమైంది. ఊహకు అందని దుస్థితికి చేరింది. భయానక పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. ఇడా హరికేణ్ వల్ల ఏకధాటిగా కురిసిన అతి భారీ వర్షాల దెబ్బకు న్యూయార్క్ నిండా మునిగిపోయింది. హఠాత్తుగా సంభవించిన వరదలతో న్యూయార్క్, న్యూజెర్సీలో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వరదల్లో 41మంది మరణించారు.

ఇడి హరికేన్ వల్ల న్యూయార్క్, న్యూజెర్సీల్లో ఏకధాటిగా అతి భారీ వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యాయి. రోడ్లన్నీ నదులను తలపించాయి. ఫ్లాష్ ఫ్లడ్ ఎమర్జెన్సీ వార్నింగ్ ను జారీ చేశారు. న్యూయార్క్, నెవార్క్, జాన్ ఎఫ్ కెన్నడీ విమానాశ్రయాలు మూసివేశారు. న్యూయార్క్ సిటీ సబ్ బే లైన్లన్నీ మూసివేశారు. న్యూయార్క్, న్యూజెర్సీ, మన్ హట్టన్, బ్రాంక్స్ అండ్ క్వీన్స్ నగరాల్లో రోడ్లపై పార్క్ చేసి ఉంచిన కార్లు పడవల్లా కొట్టుకుపోయాయి. భారీ వాహనాలు సైతం వరదనీటిలో తేలియాడుతూ కనిపించాయి. న్యూయార్క్, న్యూజెర్సీల్లో 41మందికి పైగా మరణించారు. వరదల వల్ల సంభవించిన ప్రమాదల బారిన పడి ఇప్పటిదాకా 23మంది మరణించారు. ఎక్కువమంది వాహనాల్లో చిక్కుకుపోయి మరణించినట్టు సమాచారం అందింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

గంట వ్యవధిలోనే 12 సెం.మీల వర్షం నమోదైంది. న్యూయార్క్ సెంట్రల్ పార్క్ ప్రాంతంలో గంట వ్యవధిలోనే 80 సెం.మీల వర్షం కురిసినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో అపార్ట్ మెంట్ల బేస్ మెంట్లోకి వరద పోటెత్తి చాలా మంది బయటపడే మార్గం లేక మరణించినట్టు సమాచారం.

భారీ వర్షాలతో న్యూయార్క్, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా లోని నివాసాలకు విద్యుత్ కట్ అయిపోయింది. దీంతో అవన్నీ అంధకారంలో మునిగిపోయాయి. బ్రూక్లిన్, క్వీన్స్, లాంగ్ ఐలాండ్ లోని అనేక ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.

ఇక టోర్నడోలు వాషింగ్టన్ కు సుమారు 50 కి.మీల దూరంలో బీభత్సం సృష్టించాయి. గాలికి విద్యుత్ స్తంభాలు, హోర్డింగులు, ఎలక్ట్రికల్ పోల్స్ కొట్టుకుపోయాయి. ఎవరూ ఇళ్లలోంచి బయటకు రావద్దని కార్లలో బయటకు వెళ్లొద్దని అమెరికా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.