Begin typing your search above and press return to search.
టీఆర్ ఎస్ పార్టీకి ఒక్క ఏడాదిలోనే 4.15 కోట్ల విరాళాలు
By: Tupaki Desk | 30 July 2022 9:10 AM GMTదేశంలో ప్రాంతీయ పార్టీలకు విరాళాల వరద ఉప్పొంగింది. 2020-21 ఏడాదికి 27 ప్రాంతీయ పార్టీలకు కలిపి 3,051 విరాళాల ద్వారా రూ.124.53 కోట్లు అందాయి. అందులో ఐదు పార్టీల వాటాయే రూ.113.79 కోట్లుగా ఉంది. 2019-20తో పోలిస్తే తమకు విరాళాలు పెరిగినట్లు జేడీయూ, డీఎంకే, టీఆర్ ఎస్ ప్రకటించాయి.
దేశంలో 2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను ప్రాంతీయ రాజకీయ పార్టీలు దక్కించుకున్న మొత్తం విరాళాల్లో 91% పైగా నిధులు (రూ.113.79 కోట్లు) ఐదు పార్టీల ఖాతాల్లోకే వెళ్లాయి. జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ), ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే), ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్), తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ ఎస్) ఈ జాబితాలో ఉన్నాయి.
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) రూపొందించిన తాజా నివేదికలో ఈ మేరకు వివరాలు వెల్లడయ్యాయి. 2020-21లో తమకు అందిన విరాళాలపై ప్రాంతీయ పార్టీలు ఎన్నికల సంఘానికి అందించిన సమాచారం ఆధారంగా ఏడీఆర్ ఈ నివేదికను తయారుచేసింది. అందులోని వివరాల ప్రకారం..
2020-21లో 27 ప్రాంతీయ పార్టీలకు కలిపి 3,051 విరాళాల ద్వారా రూ.124.53 కోట్లు అందాయి. అందులో ఐదు పార్టీల వాటాయే రూ.113.79 కోట్లు.
అత్యధికంగా జేడీయూకు రూ.60.15 కోట్లు (330 విరాళాలు) వచ్చాయి. తర్వాతి స్థానాల్లో డీఎంకే (రూ.33.99 కోట్లు), ఆప్ (రూ.11.32 కోట్లు), ఐయూఎంఎల్ (రూ.4.16 కోట్లు), టీఆర్ ఎస్(రూ.4.15 కోట్లు) ఉన్నాయి.
2019-20తో పోలిస్తే తమకు విరాళాలు పెరిగినట్లు జేడీయూ, డీఎంకే, టీఆర్ ఎస్ ప్రకటించాయి. తమకు ఆ సొమ్ము రాక తగ్గినట్లు ఆప్, ఐయూఎంఎల్ వెల్లడించాయి.
డీఎంకే, టీఆర్ ఎస్, జేడీయూ, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్)లకు వచ్చిన విరాళాల శాతం 2019-20తో పోలిస్తే గణనీయంగా పెరిగింది.