Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తికి 41 కోట్లు ఎవ‌రిచ్చారు?

By:  Tupaki Desk   |   30 Oct 2015 1:31 PM GMT
అమ‌రావ‌తికి 41 కోట్లు ఎవ‌రిచ్చారు?
X
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం కాకముందే వార్త‌ల్లో విశేషంగా నిలుస్తోంది. స‌రిగ్గా వారం క్రితం వ‌ర‌కు శంకుస్థాప‌న వార్త‌ల‌తో ప్ర‌పంచ చూపును త‌న‌వైపు తిప్పుకొన్న అమ‌రావ‌తి ఇపుడు నిధుల వ‌ర‌ద‌తో ఆక‌ట్టుకుంటోంది. అయితే ఈ నిధులు కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చిన సొమ్ములో లేదా విదేశీ కంపెనీలు పెట్టిన పెట్టుబ‌డో కాదు. తెలుగు ప్రజానికం త‌మ ప్ర‌జారాజ‌ధాని కోసం అందిస్తున్న తోడ్పాటు. అవి కూడా ల‌క్ష రూపాయ‌లో రెండు ల‌క్ష‌లో కాదు. కోటి రూపాయ‌లేమో అనుకుంటున్నారా? కానే కాదు! ఏకంగా రూ. 41.71 కోట్లు. అవును ఇది నిజం.

రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రజల నుంచి ఈ ఏడాది మే 20 వ‌ర‌కు అందిన విరాళం రూ.41,71,58,534. ఇందులో పీడీ ఖాతా కింద రూ. 30,90,18,965, ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ.10,81,40,007 అందాయి. ఇన్నాళ్లు ముఖ్య‌మంత్రి నిధిలో ఉన్న ఈ పూర్తి మొత్తాన్ని రాజ‌ధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్‌ డీఏ)ఖాతాకు బదిలీ చేశారు. ఈ మొత్తాన్ని అమ‌రావ‌తి నిర్మాణం కోసం ఉప‌యోగించ‌నున్నారు. ప్ర‌జారాజ‌ధాని నిర్మాణంలో భాగ‌స్వామ్యం అయ్యేందుకు ఎంత భారీ స్థాయిలో స్పంద‌న వ‌స్తోందో చూశారు కదా? ర‌ండి...మ‌న‌మూ భాగ‌స్వామ్యులం అవుదాం.