Begin typing your search above and press return to search.

తెలంగాణ‌ లో ఒక్క‌రోజే న‌లుగురి మృతి: తాజాగా 42 పాజిటివ్‌

By:  Tupaki Desk   |   20 May 2020 3:30 AM GMT
తెలంగాణ‌ లో ఒక్క‌రోజే న‌లుగురి మృతి: తాజాగా 42 పాజిటివ్‌
X
తెలంగాణ‌లో కరోనా వైర‌స్ విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. మంగళవారం ఒక్క‌రోజే న‌లుగురు ఆ మ‌హ‌మ్మారి బారిన ప‌డి మృతిచెందాడు. దాంతోపాటు కొత్త‌గా 42 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ విష‌యాన్ని వైద్యారోగ్య శాఖ ప్ర‌క‌టించింది. ఆ కేసుల్లో 34 జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదు కాగా, మరో 8 వలసదారులవి ఉన్నాయి. వాటితో క‌లిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కేసులు 1,634కు చేరాయి. అయితే వీటిలో 77 మంది వలసదారులు ఉన్నారు.

ఆ వైర‌స్ బారిన ప‌డిన 9 మంది కోలుకుని మంగళవారం నుంచి ఆస్ప‌త్రి నుంచి కోలుకున్నారు. వీరితో కలిపి 1,011 మంది చికిత్స పొంది ఆరోగ్యంగా ఇళ్ల‌కు వెళ్లిపోయారు. తాజాగా 4 కరోనా మరణాలు నమోదవ‌డంతో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 38 మంది ఆ వైర‌స్ బారిన ప‌డిన మృతి చెందారు. ఆస్ప‌త్రి లో ప్రస్తుతం 585 మంది చికిత్స పొందుతున్నారు. అయితే రాష్ట్ర‌వ్యాప్తంగా కేసులు మాత్రం న‌మోదు కాక‌పోవ‌డం విశేషం. ఈ వైర‌స్ వ్యాప్తి ఒక్క హైద‌రాబాద్ ప‌రిధిలోనే న‌మోద‌వుతున్నాయి. ఇప్పుడు తాజాగా వ‌ల‌స కార్మికుల వ‌ల‌న కేసులు పెరుగుతున్నాయి.