Begin typing your search above and press return to search.
దేశంలో 42 శాతం మంది ఆ సమస్యలతోనే మరణిస్తున్నారట.. !
By: Tupaki Desk | 27 May 2022 1:30 PM GMTదేశంలో 42 శాతం మరణాలు హృద్రోగ సమస్యలు, న్యుమోనియా, ఆస్తమా వల్లే చోటుచేసుకుంటున్నాయని జనరల్ ఆఫ్ ఇండియా(ఆర్‌జీఐ) నివేదిక వెల్లడించింది. 2020లో దేశం మొత్తం సంభవించిన మరణాల్లో ఎక్కువ శాతం ఈ మూడు సమస్యల వల్లే జరిగినట్లు తెలిపింది. కరోనా కోరలు చాచి విజృంభించిన 2020లో దేశంలో వైద్యపరంగా ధ్రువీకరించిన మొత్తం 18 లక్షల మరణాల్లో 9 శాతం కరోనా వల్లే మరణించినట్లు ఆర్‌జీఐ వెల్లడించిన నివేదికలో తేలింది.
భారత్‌లో మరణాలకు సంబంధించి కారణాలు విశ్లేషించడానికి రిపోర్ట్ ఆన్ మెడికల్ సర్టిఫికేషన్ ఆఫ్ కాజ్ ఆఫ్ డెత్ 2020 పేరుతో జనరల్ ఆఫ్ ఇండియా(ఆర్‌జీఐ) ఓ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ఏం చెప్పిందంటే.. 2020లో దేశంలో మొత్తంగా 81.15 లక్షల మరణాలు నమోదవ్వగా.. వీటిలో 18,11,688 మరణాలను వైద్యపరంగా ధ్రువీకరించారు.
వీరిలో గుండెకు(ప్రసరణ వ్యవస్థ)కు సంబంధించిన సమస్యలతో 32.1శాతం మంది ప్రాణాలు కోల్పోయారని ఆర్‌జీఐ నివేదిక తెలిపింది. శ్వాసవ్యవస్థ సంబంధిత వ్యాధులతో మరో 10 శాతం మంది మరణించారని వెల్లడించింది. వీటిలో దాదాపు తొమ్మిది శాతం అనగా 1,60,618 మరణాలు కొవిడ్‌తోనే సంభవించాయని పేర్కొంది. 2020కు సంబంధించి కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొన్న కొవిడ్ మరణాల (1,48,994) కంటే ఇవి ఎక్కువగా ఉండటం గమనార్హం. మే 25 నాటికి దేశవ్యాప్తంగా 5,24,507 మరణాలు సంభవించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ చెబుతోంది.
దేశంలో అత్యధిక మరణాలు ఊపిరితిత్తులు, గుండెకు సంబంధించిన సమస్యలే కారణంగా నిలుస్తున్నాయని ఆర్‌జీఐ నివేదిక వెల్లడించింది. వీటిని ‘ప్రసరణ వ్యవస్థ’ కారణ మరణాలుగా వర్గీకరించింది. రెండో స్థానంలో న్యుమోనియా, ఆస్తమా సంబంధిత మరణాలను మాత్రం శ్వాసకోశ వ్యవస్థ సంబంధిత మరణాలుగా పేర్కొంది. వైద్యపరంగా ధ్రువీకరించిన మొత్తం మరణాల్లో 8.9శాతం కేసులను ‘కోడ్స్ ఫర్ స్పెషల్ పర్పసెస్’ జాబితాలో చేర్చి, వాటిని కొవిడ్-19 మరణాలుగా పేర్కొంది.
ప్రాణాంతక సెప్టిసీమియా, క్షయ వంటి వ్యాధుల కారణంగా 7.1శాతం మరణాలు చోటు చేసుకున్నాయని.. ఎండోక్రైన్, పోషకాహార, జీవక్రియ వ్యాధులకు (మధుమేహం) సంబంధించి 5.8శాతం మరణాలు నమోదయ్యాయని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నివేదిక వెల్లడించింది. గాయాలు, విషప్రయోగం వంటి వాటితో 5.6శాతం మరణాలు సంభవించాయని తెలిపింది. వైద్యపరంగా ధ్రువీకరించిన మరణాల్లో 4.7శాతం క్యాన్సర్ వల్లే నమోదయ్యాయని చెప్పింది.
రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం 2020లో ఏయే ఆరోగ్య సమస్యలతో ఎంత మంది మరణించారంటే.. మొత్తంగా తొమ్మిది రకాల ఆరోగ్య సమస్యలతోనే 88.7శాతం మంది చనిపోయారు. మిగతావి 11.3శాతంగా నమోదయ్యాయి. అన్ని రకాల మరణాల్లో పురుషులు 64 శాతం, మహిళలు 36 శాతం గా ఉన్నారు.
2020లో దేశంలో అత్యధిక మరణాలు (5,17,678) మాత్రం 70ఏళ్లు అంతకు పైబడిన వారిలోనే ఉన్నాయి. 45 ఏళ్ల వయసు పైబడిన వారిలో ఎక్కువ మరణాలు హృద్రోగ సమస్యలతోనే చోటుచేసుకున్నట్లు నివేదిక చెబుతోంది. మొత్తం మరణాల్లో 5.7శాతం ఏడాది కంటే తక్కువ వయసున్న చిన్నారుల్లో కనిపించాయి.