Begin typing your search above and press return to search.
డేరా బాబాకు పద్మ అవార్డు !
By: Tupaki Desk | 1 Sep 2017 5:10 AM GMTఆశ్చర్యపోకండి మీరు చదివింది నిజమే .. కేంద్ర ప్రభుత్వం తొందరపడలేదు కాబట్టి మన అదృష్టం బాగుండి డేరా బాబా ఆలియాస్ గుర్మీత్ రాం రహీం సింగ్ కు పద్మ అవార్డు దక్కలేదు. లేకుంటే ఇప్పుడు ఆ అవార్డు నవ్వుల పాలయ్యే పరిస్థితి వచ్చేది. ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా అయిదుసార్లు ప్రతిపాదనలు పంపించుకున్నాడట డేరా బాబా.
కేంద్రం అందజేసే అత్యున్నత పౌర పురస్కారాలు పద్మ విభూషణ్ - పద్మ భూషణ్ - పద్మశ్రీ అవార్డులలో ఏదో ఒకటి డేరా బాబాకు ఇవ్వాలని సిఫారసులు వెళ్లాయట. ఈ మేరకు గుర్మీత్ సింగ్ చేసుకున్న అయిదు సిఫార్సులలో మూడు డేరా సంస్థ ప్రధాన కార్యలయం ఉన్న సిర్సా నుండి, ఒకటి హిస్సార్ నుండి వెళ్లగా మరొకటి రాజస్థాన్ లోని గుర్మీత్ జన్మ స్థలం అయిన గంగానగర్ చిరునామాల నుండి చేసుకున్నాడట.
పద్మ అవార్డులకు ఎంపికల కోసం ఈ ఏడాది కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు మొత్తం 18,768 దరఖాస్తులు సిఫార్సుల రూపంలో రాగా వాటిలో అత్యధికంగా 4208 ఒక్క డేరా బాబా కోసం అతని అనుచరులుగా భావిస్తున్న వ్యక్తులు చేసినవే ఉన్నాయని తెలుస్తుంది. బాబా ప్రయత్నాలు విఫలమై భారత్ పరువు దక్కింది కానీ అత్యాచారాల కేసులో జైలుపాలయిన బాబాకు ఇప్పటికే అవార్డు ఇచ్చి ఉంటే దేశం పరువు గంగలో కలిసేది.