Begin typing your search above and press return to search.

ఎందుకలా? ఒక నెలలో ఆ దేశంలో 45 లక్షల మంది ఉద్యోగాలకు రిజైన్

By:  Tupaki Desk   |   6 Jan 2022 5:32 AM GMT
ఎందుకలా? ఒక నెలలో ఆ దేశంలో 45 లక్షల మంది ఉద్యోగాలకు రిజైన్
X
మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. అప్పటికే కొన్నేళ్లుగా ఒకే కంపెనీలో కలిసి పని చేసే ఉద్యోగుల మధ్యనే కాదు.. కంపెనీ మీదా తెలీని భావోద్వేగం ఉంటుంది. అందుకే.. చేస్తున్న ఉద్యోగాన్ని రిజైన్ చేయాలన్న ప్రశ్న తలెత్తిన వెంటనే.. భారతీయులు అయితే మాత్రం కిందా మీదా పడుతుంటారు. అందుకు భిన్నంగా అమెరికా దేశస్తులు మాత్రం.. చేస్తున్న ఉద్యోగాల్నిచాలా సింఫుల్ గా రిజైన్ చేసేయటం కనిపిస్తూ ఉంటుంది. ఉద్యోగానికి రిజైన్ చేసి.. మరో జాబ్ ను వెతుక్కోవటం చాలా సులువు అన్నట్లుగా వారి తీరు ఉంటుంది.

తాజాగా అమెరికాకు సంబంధించిన ఆసక్తికర విషయం ఒకటి బయటకు వచ్చింది. గత నవంబరు నెలలో తాము చేస్తున్న ఉద్యోగాలను రిజైన్ చేస్తున్నట్లుగా పేర్కొన్న విషయాన్ని తాజాగా వెల్లడించారు. ఆ సంఖ్య ఏకంగా 45 లక్షలు ఉండటం విశేషం. అమెరికా కార్మిక శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం..గత సెప్టెంబరుతో పోలిస్తే అక్టోబరులో పెద్ద ఎత్తున ఉద్యోగాలకు రిజైన్ చేశారన్నారు.

జాబ్ వదిలేసుకున్న 45 లక్షల మందిలో పుడ్ సర్వీసెస్ కార్యకలాపాలు నిర్వహించేవాళ్లు దాదాపు 1.59 లక్షల మంది ఉంటారని.. తర్వాతి రంగం ఆరోగ్య సంబంధిత రంగానిదన్నారు. ఆ రంగానికి చెందిన 52 వేల మంది..రవాణా సేవల్ని అందించే శాఖకు చెందిన 33 వేల మంది.. తమ ఉద్యోగాలకురిజైన్ చేశారని పేర్కొన్నారు. నెల గడిచే సరికి జాబ్ లు లేకుండా ఉండే వారి సంఖ్యతో పాటు.. కొత్త అవకాశాలు మరెన్ని ఉన్నాయన్న విషయాన్ని వెల్లడించారు. తాజాగా అమెరికాలో మొత్తం 1.6 కోట్ల ఉద్యోగాలు అందుబాటులో ఉంటే.. గడిచిన నెలలతో పోలిస్తే.. ఎక్కువేనని చెబుతున్నారు.

కరోనా మొదట్లో.. లాక్ డౌన్ విధించిన సందర్భంలో 2.2 కోట్ల మంది ఉపాధి అవకాశాల్ని కోల్పోయారన్నారు. ఇప్పుడు మాత్రం నిరుద్యోగం రేటు రికార్డు స్థాయిలో పెరిగినట్లు పేర్కొన్నారు. గత ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 1.85 కోట్ల మంది ఉపాధి పొందుతున్నట్లు చెప్పారు. మొత్తానికి జాబ్ లు ఇట్టే వదిలేసే ఏకైక దేశంగా అమెరికానని చెప్పక తప్పదు.