Begin typing your search above and press return to search.
71 వేల కోట్లతో 45 ప్రాజెక్టులు: తండ్రి మాదిరే జలయజ్ఞానికి జగన్ శ్రీకారం
By: Tupaki Desk | 26 Jun 2020 7:20 AM GMTఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం పేరిట నీటి ప్రాజెక్టులు చేపట్టగా ఇప్పుడు ఆయన తనయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నీటి పారుదలకు పెద్దపీట వేస్తున్నారు. ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులను కొనసాగిస్తూనే కొత్తగా 45 నీటి ప్రాజెక్టులను నిర్మించనున్నారు. దీనికోసం ఏకంగా రూ.71,842 కోట్లు కేటాయించేలా అంచనాలు వేస్తున్నారు. ఈ మొత్తాన్ని రుణం ద్వారా సమకూర్చుకోవాలని యోచిస్తోంది.
వీటికోసం ప్రత్యేకంగా ఐదు స్పెషల్ పర్పస్ వెహికిల్స్ (ఎస్‌పీవీ)తో ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి.. వాటి ద్వారా ఈ రుణం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై రాష్ట్ర ఆర్థిక శాఖ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీనికి సంబంధించిన కార్యాచరణపై గురువారం తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష చేశారు.
ఈ సమావేశంలో రాయలసీమ దుర్భిక్ష నివారణ పథకం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, కృష్ణా-కొల్లేరు నిర్లవణీకరణ, పల్నాడు కరువు నివారణ పథకాలు, రాష్ట్ర జలభద్రత పథకాలపై జలవనరుల శాఖ అధికారులు సీఎం కు వివరించారు. అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల కోసం రాయలసీమ దుర్భిక్ష నివారణ పథకాని(ఆర్‌డీఎం)కి రూ.34,204 కోట్ల అంచనా వేశారు. ఈ పథకం ప్రకారం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా సంగమేశ్వరం నుంచి శ్రీశైలం కుడి ప్రధాన కాలువకు 4 కిలోమీటర్ల వరకూ రోజూ 3 టీఎంసీలను తీసుకువెళ్లాలి. ఇందుకోసం రూ.3,826 కోట్లు ఖర్చవుతుందని అంచనా. శ్రీశైలం రిజర్వాయర్ ఫోర్‌షోర్ నుంచి బానకచర్ల రిజర్యాయర్ కాంప్లెక్స్, పోతిరెడ్డిపాడు విస్తరణ పనులు చేపట్టేందుకు రూ. 570 కోట్లు అవసరమవుతాయని అంచనా.
హంద్రీ-నీవా, గాలేరు-నగరి పథకాల కాలువల అభివృద్ధి రూ.662 కోట్ల ఖర్చుతో ప్రతిపాదనలనం జ్యుడీషియర్ రివ్యూ కమిటీ పరిశీలిస్తోంది. పోలవరం ఎడమ ప్రధాన కాలువ పరిధిలో తాళ్లపాలెం నుంచి 162.4 కిలోమీటర్ల మేర కాలువ ద్వారా విశాఖ జిల్లాలోని పెదపూడి, భూదేవి, వీర నారాయణపురం రిజర్వాయర్లు, తాటిపూడి విస్తరణ రిజర్వాయర్ (విజయనగరం జిల్లా)కు 63.20 టీఎంసీల గోదావరి జలాలు తరలించే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి రూ.15,488 కోట్లు వ్యయమవుతాయని జల వనరుల శాఖ అంచనా వేసింది. ఎస్‌పీవీతో రూ.8,400 కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సంకల్పించింది.
- కృష్ణా జిల్లాలోని కొల్లేరు ప్రాంతంలో లవణ జలాల ప్రభావిత ప్రాంతాల్లో నిర్లవణీకరణ కోసం ఎస్‌పీవీ కింద రూ.3,356 కోట్లతో మరో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీని కింద ప్రకాశం బ్యారేజీకి 12 కిలోమీటర్ల దిగువన రూ.1,251 కోట్లతో బ్యారేజీన, 62 కిలోమీటర్ల దిగువన రూ.1,350 కోట్లతో మరో బ్యారేజీ నిర్మించేందుకు సిద్ధమయ్యారు.
- పల్నాడు ప్రాంత కరువు నివారణ కోసం ప్రత్యేక పథకాలకు జలవనరుల శాఖ రూపకల్పన చేసింది. ఎస్‌పీవీ కింద రూ.7,633 కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది.
- ఇప్పటికే నిర్మాణం లో ఉన్న వైఎస్సార్ పల్నాడు ఎత్తి పోతల పథకం-1కు రూ.2,845 కోట్లు, వైఎస్సార్ పల్నాడు ఎత్తిపోతల పథకం-2కు రూ.3,175 కోట్లు వ్యయం చేయాలని ప్రతిపాదించింది. ఐదో ఎస్‌పీవీ కింద రూ.12,475 కోట్ల తో కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రాజెక్టులు నిర్మించాలని జల వనరుల శాఖ భావిస్తోంది.
- రూ.593 కోట్లతో పోలవరం కుడి ప్రధాన కాలువ ట్విన్ టన్నెల్ విస్తరణ, రూ.11,375 కోట్లతో పోలవరం కుడి ప్రధాన కాలువ క్యారీయింగ్ కెపాసిటీ పెంపు స్కీంల ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ లో 45 ప్రాజెక్టులు నిర్మించేందుకు జల వనరుల శాఖ సిద్ధమైంది. అసంపూర్తి ప్రాజెక్టుల పూర్తి తో పాటు కొత్త ప్రాజెక్టులు అన్ని కలిపి పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.