Begin typing your search above and press return to search.
షెర్లిన్-రాజ్ కుంద్రా కేసులో 450పేజీల ఛార్జ్ షీట్
By: Tupaki Desk | 22 Nov 2022 3:30 AM GMTఅశ్లీల చిత్రాల కేసులో ప్రముఖ నిర్మాత వ్యాపారవేత్త అయిన రాజ్ కుంద్రా అరెస్టు అనంతరం బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. తాత్కాలిక బెయిల్ పై బయటికి వచ్చిన అతడు ముఖానికి మాస్కులు తొడిగి పబ్లిక్ అప్పియరెన్సులు ఇస్తూ పబ్లిక్ పైనా మీడియాపైనా సెటైర్లు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అతడి నిజ రూపం మాస్క్ ని తొలగించేందుకు మహారాష్ట్ర పోలీసులు సంసిద్ధమయ్యారు.
రాజ్ కుంద్రా- షెర్లిన్ చోప్రా- పూనమ్ పాండే తదితరులపై మహారాష్ట్ర సైబర్ పోలీసులు 450 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.
సైబర్ పోలీసుల ఛార్జ్ షీట్ ప్రకారం.. రాజ్ కుంద్రా.. మోడల్స్ షెర్లిన్ చోప్రా - పూనమ్ పాండే సహా పలువురు మోడల్స్ తో రెండు ఫైవ్ స్టార్ హోటల్ లో అశ్లీల వెబ్ సిరీస్ లను చిత్రీకరించారని ఆరోపించారు.
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త- వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను ఇంతకాలం డిపెండ్ చేస్తూనే ఉన్నారు. భర్తకు అండగా నిలిచారు. అతడికి ఏ పాపం తెలియదని పోలీసులే నిజాలు నిగ్గు తేలుస్తారని ప్రకటనలు చేసారు. కానీ ఇప్పుడు మరోసారి కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో వార్తల్లో నిలిచారు. తాజా పరిణామం ప్రకారం మహారాష్ట్ర సైబర్ పోలీసులు అశ్లీల చిత్రాల కేసులో రాజ్ కుంద్రా అతడి సహచరుల పై ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.
రాజ్ కుంద్రా ముంబైకి సమీపంలోని ఫైవ్ స్టార్ హోటళ్లలో అశ్లీల చిత్రాలను చిత్రీకరించి OTT ప్లాట్ ఫారమ్ లకు విక్రయించినట్లు సైబర్ పోలీసులు తమ ఛార్జ్ షీట్‌లో పేర్కొన్నారు. ఇది మాత్రమే కాదు ఈ ఒప్పందం ద్వారా రాజ్ కుంద్రా కోట్లు సంపాదించినట్లు సైబర్ సెల్ పేర్కొంది. మీడియా నివేదికల ప్రకారం... సైబర్ సెల్ రాజ్ కుంద్రా- మోడల్ షెర్లిన్ చోప్రా- పూనమ్ పాండే- చిత్రనిర్మాత మీటా జున్ జున్ వాలా.. కెమెరామెన్ రాజు దూబేలపై 450 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. బనానా ప్రైమ్ ఓటీటీకి చెందిన సువాజిత్ చౌదరి- రాజ్ కుంద్రా ఉద్యోగి ఉమేష్ కామత్ లు కూడా లండన్ కు చెందిన హాట్ షాట్ కంపెనీలో మేనేజర్లుగా ఉన్నారని ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు.
కుంద్రా సహచరుల్లో సువాజిత్ చౌదరి- ఉమేష్ కామత్ కూడా అసభ్యకరమైన కంటెంట్ తో కూడిన `ప్రేమ్ పగ్లానీ` వెబ్ సిరీస్ ను రూపొందించి OTTలో అప్ లోడ్ చేశారని ఆరోపించారు. మరోవైపు పూనమ్ పాండే తన సొంత మొబైల్ యాప్ `ది పూనమ్ పాండే`ని అభివృద్ధి చేసిందని రాజ్ కుంద్రా కంపెనీ సహాయంతో వీడియోలను చిత్రీకరించడం అప్ లోడ్ చేయడం - ప్రసారం చేయడం ద్వారా భారీగా ఆర్జించిందని ఆరోపణలు ఉన్నాయి.
సైబర్ పోలీసుల వివరాల ప్రకారం... కెమెరామెన్ రాజు దూబే షెర్లిన్ చోప్రా వీడియోలను కూడా చిత్రీకరించాడు. అయితే జున్ జున్ వాలా కథలు రాసి దర్శకత్వం వహించడంలో ఆమెకు (షెర్లిన్ చోప్రా) సహాయం చేసారని ఆరోపించారు.
అశ్లీల చిత్రాల కేసులో నిందితులందరి నుంచి రాజ్ కుంద్రాకు చెందిన `ఆర్మ్స్ ప్రైమ్` సంస్థ డబ్బు స్వీకరించినట్లు కూడా ఛార్జ్ షీట్ లో వెల్లడైంది. అందువల్ల ఛార్జ్ షీట్లో ఈ సంస్థ నేరంలో సహాయం చేసిందని ఆరోపించారు. అంతేకాదు బోల్డ్ సినిమాలకు పనిచేసిన కొందరు మోడల్స్ కోసం పోలీసులు ఇంకా ఈ కేసులో వెతుకుతున్నారు. మరోవైపు రాజ్ కుంద్రా దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.