Begin typing your search above and press return to search.
ఊరు వద్దన్నారు... ఉద్యోగమే ఊడబీకారు
By: Tupaki Desk | 14 Oct 2017 6:50 AM GMTమహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నిబంధనల ప్రకారం ఏడాదిపాటు గ్రామీణ ప్రాంతాల్లో విధులు నిర్వర్తించని 4,548 మంది డాక్టర్ల రిజిస్ట్రేషన్ ను మహారాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ - రీసెర్చ్ అధికారులు మాట్లాడుతూ 4,548 మంది డాక్టర్లు గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదిపాటు పనిచేయడానికి నిరాకరించారని, అలా పనిచేయనందుకు విధించిన జరిమానానూ వారు చెల్లించలేదని చెప్పారు. అందుకే రిజిస్ట్రేషన్లను రద్దు చేశామని - తదుపరి చర్యలను కూడా తీసుకుంటామని హెచ్చరించారు.
2005 నుంచి 2012 మధ్యవైద్యకళాశాలల్లో చదివిన వీరంతా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏడాది గ్రామీణ ప్రాంతాల్లో విధులు నిర్వర్తించాలని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ - రీసెర్చ్ అధికారులు తెలిపారు. అలా పనిచేయలేమని భావిస్తే ఎంబీబీఎస్ విద్యార్థి రూ.10లక్షలు - పోస్టుగ్రాడ్యుయేట్ విద్యార్థి రూ.50లక్షలు - సూపర్ స్పెషాలిటీ డాక్టరు రూ.2కోట్లు జరిమానా రూపంలో చెల్లించాలని వివరించారు. మహారాష్ట్ర మెడికల్ కౌన్సిల్ లో డాక్టర్ గా పేరును రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్లు తప్పనిసరిగా ప్రతి ఏడాది రెన్యువల్ చేసుకోవాలని, అలా చేసుకోకుంటే బోగస్ డాక్టర్లుగా గుర్తిస్తామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు కోల్పోయినవారంతా వైద్యం చేస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లోని హెల్త్ సెంటర్లలో మౌలిక వసతులు లేవని, అక్కడ ఎలా విధులు నిర్వర్తిస్తారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ యూత్ వింగ్ చైర్మన్ డాక్టర్ సాగర్ ముండా ప్రశ్నించారు.