Begin typing your search above and press return to search.
స్వీపర్ పోస్టుకు ఎంబీఏ - బీటెక్ గ్రాడ్యుయేట్లు
By: Tupaki Desk | 6 Feb 2019 10:47 AM GMTదేశంలో నిరుద్యోగం స్థాయి ఎంత ప్రమాదంలో ఉందో తెలియజెప్పే సంఘటన తాజాగా తమిళనాడులో కళ్లకు కట్టింది. ప్రతీ సంవత్సరం లక్షలాది మంది డిగ్రీలు - ఎంబీఏలు - బీటెక్ లు చదివి పట్టాలు పట్టుకొని రోడ్ల మీదకు వస్తున్నారు. వారంతా ఉద్యోగాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు వందలున్నా.. లక్షల్లో దరఖాస్తులు వస్తున్నాయి. చదివిన చదువు ఎంత పెద్దది అయినా సరే.. ప్రభుత్వ కొలువులో స్వీపర్ ఉద్యోగాలకు పీహెచ్డీ చదువు చదివిన వారు దరఖాస్తు చేసుకున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
తాజాగా తమిళనాడు అసెంబ్లీ సెక్రటేరియట్ లో స్వీపర్ -సానిటరీ కార్మికుల ఉద్యోగులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు ఎంటెక్ - బీటెక్ - ఏంబీఏ - పోస్టు గ్రాడ్యుయేట్లు - గ్రాడ్యూయేట్లు నుంచి వందల దరఖాస్తులు వచ్చిపడ్డాయి. వీరితోపాటు డిప్లామో పట్టా పొందిన వారు కూడా స్వీపర్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరే కాదు.. డిప్లమో పొందిన వారు కూడా స్వీపర్ పోస్టులకు పోటీపడడం అందరినీ షాక్ కు గురిచేస్తోంది.
మొత్తం 10 స్వీపర్ పోస్టులు - 4 సానిటరీ కార్మికుల పోస్టులకు గాను గత ఏడాది సెప్టెంబర్ 26న తమిళనాడు అసెంబ్లీ సెక్రెటేరియట్ దరఖాస్తులను ఆహ్వానించగా ఇలా ఉన్నత చదువులు చదివిన వారు దరఖాస్తులు చేసుకోవడం ప్రభుత్వం అధికారులను అవాక్కయ్యేలా చేసింది.