Begin typing your search above and press return to search.

అమ్మ కోసం 470 మంది మ‌ర‌ణం

By:  Tupaki Desk   |   12 Dec 2016 11:09 AM IST
అమ్మ కోసం 470 మంది మ‌ర‌ణం
X
అమ్మ‌గా త‌మిళ‌వాసుల హృద‌యాల‌ను గెలుచుకున్న దివంగ‌త‌ సీఎం జయలలిత మరణాన్ని తట్టుకోలేక ఇప్పటివరకు 470 మంది హఠాన్మరణానికి గురయ్యారని అన్నాడీఎంకే తెలిపింది. వారి మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తంచేసింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల పరిహారం చెల్లించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. అమ్మ అక‌స్మిక మ‌ర‌ణం త‌ట్టుకోలేక త‌నువు చాలించిన‌ 190 మంది మృతుల పేర్ల జాబితాను విడుదలచేసింది.

అమ్మ కోసం బ‌లిదానం చేయ‌గా...ఆరుగురు ఆత్మహత్యాయత్నం చేయగా, నలుగురి పేర్లను వెల్లడించింది. ఆత్మహత్యాయత్నంచేసిన మరో వ్యక్తి, చేతివేలు కోసుకున్న వ్యక్తికి రూ.50వేల సాయం అందజేస్తామని వివరించింది. తాజాగా ఆత్మహత్యాయత్నంచేసిన నలుగురు వ్యక్తుల వైద్య చికిత్స కోసం మరో రూ.50 వేలు అందజేయనున్నట్లు పేర్కొన్నది. ఇదిలాఉండ‌గా...జయల‌లిత‌ మృతికి సంతాపంగా తమిళనాడు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పొలచ్చి వీ జయరామన్, మున్సిపల్‌శాఖ మంత్రి ఎస్‌పీ వేలుమణిలతోపాటు సుమారు 500 మంది అన్నాడీఎంకే కార్యకర్తలు తలనీలాలు సమర్పించారు. తలనీలాలు సమర్పించిన వారిలో ఎమ్మెల్యేలు అమన్ అర్జున్, సీ అరుకుట్టి, కనగరాక్, చిన్నరాజ్, అరుణ్‌కుమార్, షణ్ముగం కూడా ఉన్నారు.