Begin typing your search above and press return to search.

కీచ‌క నేత‌ల జాబితా..టాప్‌ లో ఏపీ

By:  Tupaki Desk   |   21 April 2018 5:19 AM GMT
కీచ‌క నేత‌ల జాబితా..టాప్‌ లో ఏపీ
X
ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌ లోని ఉన్నావ్‌ లో ఓ మహిళపై బీజేపీ ఎమ్మెల్యే లైంగికదాడికి పాల్పడినట్లు ఆరోపణలు రావడం - జమ్ముకశ్మీర్‌ లోని కతువాలో ఎనిమిదేండ్ల బాలికపై లైంగికదాడి - హత్యకు పాల్పడిన సంఘటన వెలుగుచూసిన నేపథ్యంలో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) ఓ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం దేశంలో మొత్తం 1580 మంది ఎంపీలు - ఎమ్మెల్యేలపై నేరాభియోగాలు ఉండగా - అందులో 48 మంది మహిళలపై నేరాలకు పాల్పడినట్లు అభియోగాలను ఎదుర్కొంటున్నారు. వీరిలో 45 మంది ఎమ్మెల్యేలు కాగా, మిగతా ముగ్గురు ఎంపీలు. ఇందులో 12 మంది బీజేపీకి చెందిన వాళ్లే. తర్వాత స్థానాల్లో శివసేన (7) - తృణమూల్ కాంగ్రెస్ (6) ఉన్నాయి.

మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించి 48మంది ఎంపీలు - ఎమ్మెల్యేలు కేసులను ఎదుర్కొంటున్నారు. రాష్ర్టాల వారీగా చూస్తే మహారాష్ట్రలో 12 మందిపై అభియోగాలుండగా - తర్వాతి స్థానాల్లో పశ్చిమబెంగాల్ (11) - ఒడిశా (5) - ఆంధ్రప్రదేశ్ (5) ఉన్నాయి. ఈ 48 మందిపై మహిళల కిడ్నాప్ - లైంగికదాడి - అపహరణ - గృహహింస - అక్రమ రవాణా - దాడి, పెళ్లి చేసుకోవాలంటూ బలవంతం చేయడం లాంటి కేసులు నమోదయ్యాయి.తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నాయకులకు పార్టీలు ఏ అంశాల ప్రాతిపదికన టిక్కెట్లు కేటాయిస్తున్నాయని ఏడీఆర్ ప్ర‌శ్నించింది. నేరారోపణలున్న నాయకులు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలి. వారి కేసుల విచారణకు ఫాస్ట్‌ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలి అని ఏడీఆర్ సూచించింది.

నివేదికలోని ముఖ్యాంశాలు..

-దేశంలో మొత్తం 4,896 మంది ఎంపీలు - ఎమ్మెల్యేలు ఉండగా.. వారిలో 4,845 మంది ఎన్నికల అఫిడవిట్లను ఏడీఆర్ విశ్లేషించింది.

-ఐదేళ్ల‌ కాలంలో రాజకీయ పార్టీలు లైంగికదాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న 26మందికి టిక్కెట్లు ఇచ్చాయి. ఈ తరహా అభియోగాలను ఎదుర్కొంటున్నట్లు 14 మంది స్వతంత్ర అభ్యర్థులు ప్రకటించారు.

-గత ఐదేళ్ల‌ కాలంలో మహిళలపై నేరాలకు పాల్పడిన 327 మందికి పలు రాజకీయ పార్టీలు టిక్కెట్లు ఇచ్చాయి. ఇవే ఆరోపణలు ఎదుర్కొంటున్న 118 మంది స్వతంత్రులు పార్లమెంట్ - అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు.

-మహిళలపై నేరాలు అభియోగాలను ఎదుర్కొంటున్న వారిలో ఐదేళ్ల‌ కాలంలో బీజేపీ 47 మందికి టిక్కెట్లు ఇచ్చింది. తర్వాత స్థానాల్లో బీఎస్పీ (35 మంది) - కాంగ్రెస్ (24 మంది) ఉన్నాయి.

-ఇదే కాలంలో రాష్ర్టాల వారీగా చూస్తే మహిళలపై నేరాల ఆరోపణలు ఎదుర్కొంటున్న 65 మందికి మహారాష్ట్ర టిక్కెట్లు ఇచ్చింది. తర్వాత స్థానాల్లో బీహార్ (62 మంది) - పశ్చిమ బెంగాల్ (52 మంది) ఉన్నాయి.