Begin typing your search above and press return to search.

ఆ పార్టీ కార్యకర్తలకి గుడ్ న్యూస్ .. 481 మందికి కీలక పదువులు

By:  Tupaki Desk   |   4 Sep 2021 4:30 PM GMT
ఆ పార్టీ కార్యకర్తలకి గుడ్ న్యూస్ .. 481 మందికి కీలక పదువులు
X
ఆంధ్రప్రదేశ్ లో పదవుల కోసం ఎదురుచూస్తున్న కార్యకర్తలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో 47 కార్పొరేషన్లకు 481 మందిని డైరెక్టర్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో కార్పొరేషన్‌ చైర్మన్ల నియామకం ఊసే లేదన్నారు. వైఎస్ జగన్ స్వయంగా డైరెక్టర్ల నియామకంలో పాల్గొని అన్ని వర్గాలకు పెద్దపీట వేశారని చెప్పుకొచ్చారు.

481 డైరెక్టర్ల పదవుల్లో ఎస్సీ, బీసీ, మైనార్టీలకు 58 శాతం, ఓసీలకు 42శాతం కేటాయించినట్లు తెలిపారు. వీటిలో అత్యధికంగా మహిళలకు 52 శాతం అవకాశం కల్పించినట్లు సజ్జల తెలిపారు. చంద్రబాబు కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారని తెలిపారు. రాజ్యసభ సీటు విషయంలో బాబు ఎస్సీలను అవమానించారన్నారు. చంద్రబాబు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఓటు బ్యాంక్‌గానే చూశారన్నారు. సామాజిక న్యాయం కార్పొరేషన్ల స్థాయిలో అమలయ్యే విధంగా తయారు చేశారన్నారు. ఎస్సీ, బీసీ, మైనార్టీలకు 58 శాతం పదవులు ఇచ్చామన్నారు. బలహీన వర్గాలను ముందుకు తీసుకురావడమే సీఎం జగన్‌ లక్ష్యమని సజ్జల అన్నారు.

ఈ సమావేశంలో హోం మంత్రి మేకపాటి సుచరిత, బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున పాల్గొన్నారు. మహిళలకు సీఎం వైఎస్‌ జగన్‌ అధిక ప్రాధాన్యం ఇచ్చారని హోంమంత్రి సుచరిత చెప్పుకొచ్చారు. కార్పొరేషన్‌ డైరెక్టర్ల నియామకంలో మహిళలకు 52 శాతం పదవులు ఇచ్చారన్నారు. 31 లక్షల ఇళ్ల పట్టాలన్నీ మహిళల పేరు మీదే ఇచ్చి వారి ప్రాధాన్యం ఏమిటో చెప్పారని సుచరిత అన్నారు.