Begin typing your search above and press return to search.

దివాక‌ర్ ట్రావెల్స్ లో అంత ప‌ని జ‌రిగిందా?

By:  Tupaki Desk   |   10 Feb 2020 7:20 AM GMT
దివాక‌ర్ ట్రావెల్స్ లో అంత ప‌ని జ‌రిగిందా?
X
తెలుగుదేశం పార్టీ నేత జేసీ దివాక‌ర్ రెడ్డికి సంబంధించిన దివాక‌ర్ ట్రావెల్స్ విష‌యంలో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌స్తూ ఉన్నాయి. ఇప్ప‌టికే భారీ ఎత్తున దివాక‌ర్ ట్రావెల్స్ బ‌స్సులు సీజ్ అయ్యాయి. మొద‌ట కాంగ్రెస్, ఆ త‌ర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు ఆయా పార్టీల్లో కీల‌క నేత‌గా మెలిగిన దివాక‌ర్ రెడ్డి అప్ప‌ట్లో త‌న బ‌స్సుల‌ను ఇష్టారీతిన న‌డిపించార‌నే ఆరోప‌ణ‌లున్నాయి. ఇప్పుడు దివాక‌ర్ రెడ్డి ఉన్న పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉంది. దీంతో ఆయన అక్ర‌మ ప‌ద్ధ‌తిన న‌డిపిన బ‌స్సులు సీజ్ అవుతూ ఉన్నాయి. అయితే ఇదంతా క‌క్ష సాధింపు అని దివాక‌ర్ రెడ్డి ఆరోపిస్తూ ఉన్నారు.

బ‌స్సులు న‌డ‌ప‌డంలో అన్నీ క‌రెక్టుగా ఉండాలంటే కుద‌ర‌దు అని అంటూ దివాక‌ర్ రెడ్డి త‌న రొటీన్ స్టైల్లోనే మాట్లాడుతూ ఉన్నారు. ఆ సంగ‌త‌లా ఉంటే.. దివాక‌ర్ రెడ్డి ట్రావెల్స్ బ‌స్ ల‌లో వ్య‌భిచారం దందా కూడా న‌డిచింద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.

ఏడెనిమిదేళ్ల కింద‌టి వ్య‌వ‌హారం ఇప్పుడు చర్చ‌లోకి వ‌చ్చింది. దివాక‌ర్ రెడ్డి కి సంబంధించిన స్లీప‌ర్ బ‌స్సుల్లో వ్య‌భిచారం జ‌రిగింద‌ని, ఆ వ్య‌వ‌హారం రెడ్ హ్యాండెడ్ గా దొరికింద‌ని తెలుస్తోంది. ర‌వాణా శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా అప్పుడు ప‌ట్టుకున్నార‌ని, బ‌స్సును కూడా సీజ్ చేశార‌ని తెలుస్తోంది.

ర‌వాణా శాఖ నియ‌మాల‌ను, నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మించి బ‌స్సుల‌ను న‌డిపారంటే అదో లెక్క‌. అయితే ఇలా బ‌స్సుల్లో వ్య‌భిచారం కూడా జ‌రిగిందంటే..ఇది షాకింగ్ వ్య‌వ‌హారంలా ఉంద‌ని ప‌లువురు అభిప్రాయ‌ ప‌డుతూ ఉన్నారు. ఈ వ్య‌వ‌హారం జేసీ వాళ్ల‌కు తెలిసిందా, జ‌రిగిందా..అనే సంగతెలా ఉన్నా, బ‌స్సుల్లో వ్య‌భిచారం అది కూడా ప‌ట్టుబ‌డి పోవ‌డం..ఇవ‌న్నీ మాత్రం విస్మ‌య‌క‌రంగా ఉన్నాయి.